Telugu News » Blog » తిరుమల శ్రీవారిని వడ్డీ కాసుల వాడు అని ఎందుకు అంటారు ?

తిరుమల శ్రీవారిని వడ్డీ కాసుల వాడు అని ఎందుకు అంటారు ?

by Bunty
Ads

తిరుమల శ్రీవారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోనే అత్యంత ధనవంతుడు తిరుమల వెంకటేశ్వర స్వామి. నిత్యం శ్రీవారిని దర్శించుకునేందుకు లక్షల్లో జనాలు వస్తారు. జనాలతో పాటు.. కోట్లలో ఉండి ఆదాయం కూడా చేకూరుతుంది. మొన్న కరోనా సమయంలోను ఎక్కడా తగ్గకుండా జనాలు విపరీతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని వారి మొక్కులు అప్పజెప్పారు. శ్రీవారి దేవాలయం ఒక తిరుమల లో కాకుండా దేశ నలుమూలలా విస్తరిస్తోంది.

Advertisement

READ ALSO : పేపర్ కప్పులో టీ తాగితే అంత డేంజరా?

Advertisement

ప్రముఖ పట్టణాలలో శ్రీవారి దేవాలయాలను టీటీడీ నిర్మిస్తోంది. ఇదంతా పక్కకు పెడితే, శ్రీవారికి అనేక పేర్లు ఉన్నాయి. అయితే వెంకటేశ్వర స్వామికి వడ్డీ కాసుల వాడనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక సమయంలో వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని పెళ్లి చేసుకోవడానికి భూలోకం వచ్చాడట. అయితే లక్ష్మీదేవిని వైకుంఠంలోనే వదిలి రావడంతో ఆయన దగ్గర డబ్బులు లేకుండా పోయాయి.

READ ALSO :  కిచ్చా సుదీప్ పై ప్రకాష్ షాకింగ్ కామెంట్స్… బిజెపికి మద్దతు ఇవ్వడం ఏంటి..?

Tirumala Tirupati Devasthanams trust receives highest ever single-day donations of Rs 84 crore | Amaravati News - Times of India

దీంతో పెళ్లికి డబ్బు పుట్టలేదు. ఈ తరుణంలోని కుబేరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పెళ్లికి అయ్యే ఖర్చును మొత్తం ఇచ్చారట. ఒక సంవత్సరంలోగా ఆ అప్పు తీరుస్తారని వెంకటేశ్వర స్వామి చెప్పాడట. అయితే తీరా సంవత్సరం దాటేసరికి వెంకటేశ్వర స్వామి అప్పు తీర్చకుండా వడ్డీ కడతాడట. అప్పటి నుంచి కుబేరుడికి ఇవ్వాల్సిన అప్పు వడ్డీ అలాగే పెరిగి పెరిగి చాలా పెద్ద మొత్తమే అవుతూ వస్తుంది. అయినా స్వామి మాత్రం వడ్డీనే కడుతూ వస్తున్నారట. అందుకే శ్రీవారికి వడ్డీ కాసుల వాడని పేరు వచ్చింది.

Advertisement

READ ALSO :  AdiPurush : హనుమాన్ జయంతి స్పెషల్… ‘ఆది పురుష్’ నుంచి కొత్త పోస్టర్…

You may also like