Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » కిచ్చా సుదీప్ పై ప్రకాష్ షాకింగ్ కామెంట్స్… బిజెపికి మద్దతు ఇవ్వడం ఏంటి..?

కిచ్చా సుదీప్ పై ప్రకాష్ షాకింగ్ కామెంట్స్… బిజెపికి మద్దతు ఇవ్వడం ఏంటి..?

by Bunty
Ads

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలన్నీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ హోరా హోరా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కర్ణాటకలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకపక్క పొలిటికల్, మరో పక్క సినీ గ్లామర్ తో కర్ణాటక రాజకీయాలు రసవంతంగా మారాయి. సౌత్ లో ఇప్పటికే తమ హీరోలను తమవైపు తిప్పుకున్న కమలం… రాబోయే ఎలక్షన్స్ లో సినీ గ్లామర్ ను డబుల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.

Advertisement

READ ALSO : విడాకుల తర్వాత..సమంత కోసం చీకటి గదిలో నాగచైతన్య ఏడ్చాడా…?

Ad

అయితే ఈ క్రమంలో తాజాగా కన్నడ హీరో కిచ్చా సుదీప్ దర్శన్ లు బిజెపికి సపోర్ట్ ఇవ్వడంతో కన్నడ నాట రాజకీయం హాట్ హాట్ గా మారాయి. బిజెపికి కిచ్చా సుదీప్ సపోర్ట్ ఇవ్వడంపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులకు కిచ్చా సుదీప్ మద్దతు ఇవ్వడంపై ప్రకాష్ రాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కిచ్చా సుదీప్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంపై కిచ్చా సుదీప్ మాట్లాడుతూ మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి పార్టీ తరపున ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

READ ALSO : IPL 2023 : అయ్యో కేన్ మామ…క్రికెట్ మొత్తానికి దూరం కాబోతున్నాడా ?

Get ready for questions': Prakash Raj to Sudeep for supporting Bommai | Deccan Herald -

అయితే కర్ణాటక ముఖ్యమంత్రి సూచించిన అభ్యర్థులకు మాత్రమే ప్రచారం చేస్తానని ప్రకటించారు. పార్టీలో చేరబోనంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. కిచ్చా సుదీప్ చేసిన ప్రకటనపై స్పందించిన ప్రకాష్ రాజ్, ఎప్పటినుంచో భారతీయ జనతా పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్న ప్రకాష్ రాజ్… కిచ్చా సుదీప్ “కాషాయ పార్టీకి ఎర కాబోరు.. చాలా తెలివైన వారు” అంటూ ట్వీట్ చేశారు. అయితే తాను రాజకీయాల్లోకి రావడం లేదని సుదీప్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కష్ట సమయాల్లో ఆయన తనకు అండగా నిలిచారని, తన కుటుంబంతో చాలా సన్నిహిత బంధాన్ని పంచుకున్నారని గుర్తు చేసుకున్న కిచ్చా సుదీప్ బొమ్మైకి తన మద్దతును ప్రకటించారు.

READ ALSO : AdiPurush : హనుమాన్ జయంతి స్పెషల్… ‘ఆది పురుష్’ నుంచి కొత్త పోస్టర్…

Visitors Are Also Reading