Home » స్టార్ మాలో సుధీర్ రెమ్యున‌రేష‌న్ ఎంతో మీకు తెలుసా..?

స్టార్ మాలో సుధీర్ రెమ్యున‌రేష‌న్ ఎంతో మీకు తెలుసా..?

by Anji
Ad

సుడిగాలి సుధీర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. సుధీర్ అనే పేరు వినిపించిందంటే చాలు ఆ వార్త వైర‌ల్ గా మారిపోవ‌డం ఖాయం. జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ద్వారా ఆ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు సుధీర్‌. తొలుత ఇత‌ను ఒక సాదాసీదా క‌మెడియ‌న్‌గా ఎంట్రి ఇచ్చి ఇక ఆ త‌రువాత టీమ్ లీడ‌ర్‌గా ఎదిగాడు. సుధీర్ పంచ్‌లు వేయ‌డ‌మే కాదు.. తీసుకోవ‌డంలోనూ మజా ఉంద‌ని నిరూపించుకున్నాడు. ఎంతో మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు.

Advertisement

తాజాగా ఏమైందో ఏమో కానీ సుధీర్ జ‌బ‌ర్ద‌స్త్ షో నుంచి త‌ప్పుకుని ఇప్పుడు మ‌రొక చాన‌ల్ లో ప్ర‌త్య‌క్షమ‌య్యాడు. జ‌బ‌ర్ద‌స్త్ నుంచి ఎందుకు త‌ప్పుకున్నాడ‌నే చ‌ర్చ గ‌త కొంత‌కాలంగా జ‌రుగుతూనే ఉన్న‌ది. జ‌బ‌ర్ద‌స్త్‌కు ఎంతో సేవ చేసిన సుడిగాలి సుధీర్ రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో జ‌బ‌ర్ద‌స్త్ నిర్వాహ‌కుల‌తో డీల్ కుద‌ర‌క బ‌య‌టికి వ‌చ్చేసాడనే టాక్ కూడా వినిపించింది. ఇదిలా ఉండ‌గా.. ప్ర‌స్తుతం స్టార్ మా ఛాన‌ల్ లో సూప‌ర్ సింగ‌ర్ జూనియ‌ర్ ప్రోగ్రామ్‌కి అన‌సూయ‌తో క‌లిసి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ షోలో సుధీర్ పారితోషికం ఎంత అనే విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

గ‌తంలో యాంక‌ర్ అనసూయ కంటే సుధీర్ టీమ్ లీడ‌ర్‌గా పారితోషికం త‌క్కువ‌గానే తీసుకున్నాడ‌ట‌. ఈ విష‌యంలో జ‌బ‌ర్ద‌స్త్ నిర్వాహ‌కుల‌తో సుధీర్‌కు మ‌ధ్య వివాదం త‌లెత్తింద‌ట‌. ప్ర‌స్తుతం స్టార్ మా ఛానెల్‌లో సుధీర్‌కి పారితోషికం బాగానే ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ త‌రుణంలోనే కొన్ని ఛాన‌ల్‌లో కూడా ఎంట్రీ ఇవ్వాల‌ని చూస్తున్నాడు సుధీర్. త్వ‌ర‌లో కామెడీ స్టార్స్‌లో కూడా ఎంట్రీ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం. స్టార్ మాలో యాంక‌ర్‌గా ప్ర‌త్య‌క్షం అవ్వ‌గా.. ఆరున్న‌ర నుంచి ఏడు ల‌క్ష‌ల వ‌ర‌కు పారితోషికం అందుకుంటున్నాడ‌ని తెలుస్తోంది. ఇది జ‌బ‌ర్ద‌స్త్ ఇచ్చే దానికంటే ఇది చాలా ఎక్కువ అంట‌. సుధీర్ రెమ్యున‌రేష‌న్ ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : 

‘ఓయ్’ సినిమా హీరోయిన్ గుర్తుందా ? ఇపుడు ఎక్కడుంది ? ప్రస్తుతం ఏమి చేస్తుందంటే ?

రామ్ చ‌ర‌ణ్ బాల‌న‌టుడిగా న‌టించిన సినిమా ఏదో మీకు తెలుసా..?

 

Visitors Are Also Reading