Home » “కథానాయకుడు” సినిమాలో జగపతి బాబు రోల్ ను ఆ స్టార్ హీరో మిస్ చేసుకున్నారా? ఒకవేళ చేసుంటే?

“కథానాయకుడు” సినిమాలో జగపతి బాబు రోల్ ను ఆ స్టార్ హీరో మిస్ చేసుకున్నారా? ఒకవేళ చేసుంటే?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు అట్టర్ ప్లాప్ అవుతుంటాయి. అవే సినిమాలు తిరిగి టివిలో టెలికాస్ట్ అయితే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటాయి. అలాంటి సినిమాల లిస్ట్ లో “కథానాయకుడు” ముందు ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేదు. కానీ, ఆ తరువాత టివిలో వచ్చిన తరువాత మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది.

Advertisement

ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్, జగపతి బాబు కలిసి నటించారు. అందరు ఈ సినిమాలో రజిని కాంత్ హీరో అనుకున్నారు. కానీ, సినిమా రిలీజ్ అయ్యాక.. ఇందులో రజినీకాంత్ ముఖ్య పాత్ర మాత్రమే పోషించారని తెలియడంతో అంచనాలు తలకిందులయ్యాయి. ఈ సినిమాలో మెయిన్ హీరో గా జగపతి బాబు నటించారు. అసలు ఈ సినిమా కోసం ఫస్ట్ ఎంచుకున్న ఛాయస్ జగపతి బాబు కాదు. విక్టరీ వెంకటేష్ ను హీరోగా తీసుకోవాలని అనుకున్నారట.

Advertisement

ఇలాంటి సెంటిమెంట్ క్యారెక్టర్లలో జీవించేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తీరా ఈ సినిమా షూటింగ్ అనుకునే సమయానికి వెంకటేష్ వేరే సినిమాలతో బిజీ అవ్వడంతో ఈ స్క్రిప్ట్ జగపతి బాబు చేతికి వెళ్ళింది. ఆ తరువాత సంగతి మనకి తెలిసిందే. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది కానీ.. అంచనాలు తప్పడంతో థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ ని మాత్రం ఎప్పటికీ మరచిపోలేము. ఇదే రోల్ వెంకటేష్ చేసి ఉంటె.. ఆ సీన్స్ వేరే లెవెల్ లో హైలైట్ అయ్యేవి అని వెంకీ ఫాన్స్ ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు.

మరిన్ని..

RRR 2 కి దర్శకత్వం వహించేది ఎవరో తెలుసా ? జక్కన్న ప్లాన్ మామూలుగా లేదుగా..!

హరికృష్ణ చివరి కోరిక ఇదేనట..ఇన్నాళ్లకు బయట పడింది !

నయనతార భర్తకు షారూఖ్ ఖాన్ వార్నింగ్.. అందుకోసమేనా ? 

Visitors Are Also Reading