Telugu News » Blog » SSC JOBS: ఇంటర్ ఉత్తీర్ణులు అయ్యారా.. రూ.81వేల జీతం..!!

SSC JOBS: ఇంటర్ ఉత్తీర్ణులు అయ్యారా.. రూ.81వేల జీతం..!!

by Sravanthi Pandrala Pandrala

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1600 పోస్టులకు పైగా ఉద్యోగాలకు దరఖాస్తులు అడుగుతోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ స్థాయిలో అసిస్టెంట్ (PA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) స్టార్టింగ్ అసిస్టెంట్ (SA), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (jsa), లోయర్ డివిజన్ క్లర్క్ (ldc), డేటా ఎంట్రీ ఆపరేటర్ (గ్రేడ్ A) వంటి పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అంతేకాకుండా ఇంటర్ రెండవ సంవత్సరం చదివే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో కొన్ని పోస్టులకు సంబంధించి సైన్సు, మ్యాథ్స్ సబ్జెక్టులు తప్పనిసరిగా ఉండాలి.

Advertisement

దరఖాస్తు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు www.ssc.nio.in లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి.

చివరి తేదీ:
ఈ నోటిఫికేషన్ సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే స్టార్ట్ అయింది. జూన్ 8వ తేదీ వరకు అప్లికేషన్ల గడువు ముగుస్తుంది. పదవ తేదీ వరకు ఆన్లైన్లో పేమెంట్ చేయవచ్చు. 14 నుంచి 15 తేదీల మధ్య అప్లికేషన్ విధానంలో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.
జనరల్ ఓబీసీ కేటగిరి వాళ్లకు ₹100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ మహిళలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వయస్సు 18 నుంచి 27 సంవత్సరాలు. అర్హులైన వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

మరికొన్ని ముఖ్య వార్తలు :

You may also like