Home » ఆ సమయంలో సీఎం కేసీఆర్ నరేష్ ని ఏమన్నారో తెలుసా ?

ఆ సమయంలో సీఎం కేసీఆర్ నరేష్ ని ఏమన్నారో తెలుసా ?

by Anji
Published: Last Updated on

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ పై స్వయంగా నరేష్ నిర్మిస్తున్న ఈ సినిమాని ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహిస్తున్నారు. . ఇప్పటికే ఈ సినిమాపై ఓ  రేంజ్ లో హైప్ క్రియేట్ అయింది. మే 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా విడుదలైంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ఓ రేంజ్ లో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా చురుకుగా పాల్గొంటున్నారు నరేష్, పవిత్ర లోకేష్. 

కేవలం తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లో కూడా ప్రెస్ మీట్స్ నిర్వహిస్తూ తమ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా మరోసారి ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నరేష్, పవిత్ర ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో సోషల్ మీడియా ట్రోల్స్ గురించి ఓ టాపిక్ వచ్చింది. ఓ  అభిమాని ఈ మధ్య కేసీఆర్ గారితో మీరు మాట్లాడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో  తెగ వైరల్ అయింది.ఆ టైంలో కేసీఆర్‌తో మీ కాన్వర్జేషన్ ఏంటి అని అడిగాడు. ఆరోజు అక్కడ అసలు ఏం జరిగిందో వివరించారు నరేష్. ‘‘ఈ వీడియో గురించి బయట రకరకాలుగా మాట్లాడుకున్నారు. కేవలం క్లిక్స్ కోసం.. ఓ కుటుంబం సంక్షోభంలో ఉన్నప్పుడు అలా పెట్టడం పాపం తగులుతుంది. అలా పెట్టింది ఎవరో నాకు తెలియదు. దేవుడు దయ వల్ల బాగుండాలి’’ అని అన్నారు.

వాస్తవానికి  ఆరోజు నా పక్కన మహేష్ కూర్చున్నాడు. మరోపక్క సీఎం కేసీఆర్ గారు కూర్చున్నారు. సంతోష్ నన్ను పిలిచారు. మేమిద్దరం ఫ్రెండ్స్. అఫీషియల్ గన్ ఫైరింగ్ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. ఎవరైనా చనిపోతే గవర్నమెంట్ అఫీషియల్ గన్ ఫైర్ హానర్ ఇస్తుంది. ఇది స్టేట్ లోనే ఒక అరుదైన గౌరవం. జనరల్ గా దీన్ని ఎవరో ఒకరు గవర్నమెంట్ కి రికమండ్ చేస్తారు. మన స్టేట్ సీఎంకి రికమెండ్ చేస్తే అప్పుడు సీఎం అందుకు ఉత్తర్వులు జారీ చేయాలి. ఇదే విషయాన్ని సంతోష్ నాకు చెబుతూ.. మీకు తెలుసా ఈ విషయం ఎవరి రికమండేషన్ లేకుండా కృష్ణ మీద ఉన్న అభిమానంతో మన సీఎం ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ మర్యాదలు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం ఒకసారి మహేష్ కి చెప్పండి అని నాతో అన్నారు’’ అని నరేష్ తెలిపారు. 

‘‘ఆ విషయాన్నినేను మహేష్ దగ్గరికి వెళ్లి చెప్పాను. బాధలో ఉండటం వల్ల మహేష్ నేను చెప్పింది అర్థం చేసుకోలేకపోయాడు. మహేష్ ఇలా సీఎం గారు స్టేట్ హానర్స్ ఇవ్వాలని స్వయంగా నిర్ణయం తీసుకున్నారని చెప్తే.. అప్పుడు మహేష్ నమస్కారం చేస్తూ.. నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అన్నాడు. దాంతో నేను కేసీఆర్  దగ్గరికి వెళ్లి నిజంగా మీకు పాదాభివందనాలు సర్, థాంక్స్ అని నమస్కారం చేశాను. అప్పుడు కేసీఆర్ నన్ను ఆపి కాదమ్మా.. అది నా మనసు నుంచి వచ్చింది. కాబట్టి అలా నువ్వు అనొద్దు అని అన్నారు. అది అక్కడ జరిగింది’’ అని నరేష్ ఆ రోజు జరిగిన విషయాన్ని వివరించారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

MS నారాయణ రాసిన కథలను లేపేసిన ఆ స్టార్ దర్శకుడు ఎవరో తెలుసా ?

నల్లగా ఉన్నానని మొదట భయపడిన సాయి పల్లవి..స్టార్ హీరోయిన్ ఎలా అయ్యిందో తెలుసా..?

Visitors Are Also Reading