Home » మహేష్ కోసం పెంచిన థమన్..!

మహేష్ కోసం పెంచిన థమన్..!

by Azhar
Ad
ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ జోష్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే అందరూ చెప్పే ఒక్కే పేరు ఎస్.ఎస్. థమన్. 2020 ముందువరకు టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ ఉండేవాడు. కానీ ఆ ఏడాది విడుదల అయిన అలా వైకుంఠపురములో సినిమా మొత్తం మారిపోయింది అనే చెప్పాలి. ఈ సినిమాలో పాటలు అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి.
అప్పటి వరకు టాలీవుడ్ లో పాటలకు సంబంధించి ఉన్న అన్ని రికార్డులను ఈ సినిమాతో థమన్ బ్రేక్ చేసాడు. దాంతో అప్పటి నుండి థమన్ చేతిలో సినిమాలు అనేవి పెరిగిపోయాయి. ప్రతి హీరో కూడా తన సినిమాకు థమన్ మ్యూజిక్ అందించాలని కోరుకుంటున్నారు. ఇక థమన్ కూడా దాదాపు ఒక్కో సినిమాకు రెండు కోట్ల రెమ్యునరేషన్ అనేది తీసుకుంటూ వీలైనన్ని ఎక్కువ సినిమాలు అనేవి చేస్తున్నాడు.
కానీ ఇప్పుడు థమన్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి మ్యూజిక్ అందించనున్నాడు. మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త సినిమా అనేది వస్తుంది. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ చేయబోతున్నాడు. కానీ అందుకోమ్మా రెమ్యునరేషన్ అనేది భారీగా పెంచినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు సినిమాకు రెండు కోట్లు అందుకున్న థమన్..  మహేష్ సినిమా కోసం నాలుగు కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి థమన్ అడిగినంత ఈ సినిమా నిర్మాతలు ఇస్తారా.. లేదా అనేది.

Advertisement

Visitors Are Also Reading