Home » పవన్ కళ్యాణ్ కి అలాంటి అలవాట్లు…శృతిహాసన్ కామెంట్స్ వైరల్…!

పవన్ కళ్యాణ్ కి అలాంటి అలవాట్లు…శృతిహాసన్ కామెంట్స్ వైరల్…!

by Bunty
Ad

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా బ్రదర్స్ లో చిన్నవాడైన పవన్ కళ్యాణ్ ని తన కుటుంబ సభ్యులందరూ చాలా గారాబంగా, చిన్న పిల్లాడిలా చూసుకునేవారు. ఇప్పటికీ తన వదిన, అన్నలు కూడా పవన్ కళ్యాణ్ ని చిన్నపిల్లాడిలాగా చూసుకుంటారట. ఈ క్రమంలోనే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ అలవాటు గురించి శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ కి ఇలాంటి అలవాటు ఉందా అని ముక్కున వేలేసుకుంటున్నారు.

Advertisement

వివరాల్లోకి వెళ్తే…. పవన్ కళ్యాణ్, శృతిహాసన్ వీరిద్దరి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. దీంతో శృతిహాసన్, పవన్ కళ్యాణ్ మధ్య చాలా మంచి బాండింగ్ ఉందట. పవన్ గురించి శృతికి అన్ని విషయాలు తెలుసు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ కి బొమ్మలతో ఆడుకునే అలవాటు ఉంది. ఇది చెబితే ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ కి బొమ్మలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అని శృతిహాసన్ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే సాయిధరమ్ తేజ్ కూడా మా మామయ్యకి బొమ్మలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. మా చిన్నతనంలో ఆయన ఎక్కువగా బొమ్మలతో ఆడుకునేవాడు.

నిజానికి మా కన్నా ఎక్కువగా ఆయనే బొమ్మలతో ఆడుకునేవాడు. మమ్మల్ని పిలిచి మరి ఆడుకుందాం రండి అని తీసుకెళ్లేవాడు. నేను ఎప్పుడైనా బొమ్మలు కొనుక్కుంటే ఆయన కోసం కూడా ఒక సెట్ తీసుకునే వాడిని. మా అమ్మ కూడా పవన్ కళ్యాణ్ కి ఎప్పుడు బొమ్మలు కొంటూ ఉండేది. చిరంజీవి కూడా బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తన పిల్లలకి, తమ్ముడికి బొమ్మలు తీసుకుని వచ్చేవాడట. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాకు వాటితో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పడం జరిగింది. ఈ విషయం తెలిసిన చాలామంది అభిమానులు ఎంత పెద్ద వారైనా సరే, ఎంత ఉన్నత కుటుంబంలో ఉన్న వారైనా వారికి చిన్నచిన్న అలవాట్లు చాలా సంతోషాన్ని ఇస్తాయని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading