Home » మెగా ఛాన్స్ కొట్టేసిన ‘సలార్’ హీరోయిన్‌..?

మెగా ఛాన్స్ కొట్టేసిన ‘సలార్’ హీరోయిన్‌..?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న విష‌యం విధిత‌మే. ఆచార్య గాడ్ ఫాద‌ర్‌, భోళా శంక‌ర్ సినిమాల‌తో పాటు మైత్రీ మూవీ మేక‌ర్స్ ర‌వీంద్ర ద‌ర్శ‌క‌త్వంలో మెగా 154 కూడా సెట్స్ మీద‌కు వెళ్లిన‌ది. అయితే తాజాగా ఈ సినిమా గురించిన ఒక క్రేజీ న్యూస్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తున్న‌దట‌. క్రాక్ హిట్‌తో ట్రాక్ ఎక్కిన ఈ బ్యూటీ పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌రాల్ లో న‌టిస్తోంది.

mega 154

Advertisement

Advertisement

ఇది మాత్రమే కాకుండా ఈ ముద్దుగుమ్మ బాల‌య్య స‌ర‌స‌న గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో కూడా మెగా ఆఫ‌ర్‌ను అందుకున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. మెగా 154లో హీరోయిన్ పాత్ర‌కు ప్రాధాన్య‌త ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఈ చిత్రంలో చిరు అండ‌ర్ క‌వ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌నున్నాడు. ప్ర‌స్తుతం పైన‌ల్ టాక్స్ ద‌శ‌లో ఉన్న ఈ డీల్ త్వ‌ర‌లో ఫినిష్ అయిపోతుంద‌ని శృతి సైతం ఈ ఆఫ‌ర్‌ని ఒడిసిప‌ట్టిన‌ద‌ని టాక్ వినిపిస్తోంది. అయితే త్వ‌ర‌లోనే మూవీ మేక‌ర్స్ అధికారిక ప్ర‌క‌ట‌న ఇవ్వ‌నున్నార‌ట‌. చిరు, శృతిల మ‌ధ్య కెమిస్ట్రీ ఎలా ఉండ‌బోతుందో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Visitors Are Also Reading