Home » SRIREDDY : బాల‌య్యను వియ్యంకుడిని చేసుకుని ఎన్టీఆర్ ను తొక్కేశారు….శ్రీరెడ్డి సంచ‌ల‌నం..!

SRIREDDY : బాల‌య్యను వియ్యంకుడిని చేసుకుని ఎన్టీఆర్ ను తొక్కేశారు….శ్రీరెడ్డి సంచ‌ల‌నం..!

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో కొంత‌మంది క‌ష్టాన్ని న‌మ్ముకుని పాపులారిటీ సందిస్తే మ‌రికొంద‌రు మాత్రం కాంట్ర‌వ‌ర్సీల‌ను క్రియేట్ చేస్తూ పాపుల‌ర్ అవుతుంటారు. అలా కాంట్ర‌వ‌ర్సీల‌తోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న న‌టి శ్రీరెడ్డి. నిజానికి న‌టి శ్రీరెడ్డి అంటే పెద్ద‌గా గుర్తుకు రాక‌పోవ‌చ్చు కానీ క్యాస్టింగ్ కౌచ్ శ్రీరెడ్డి అంటే తెలియ‌ని వారుండ‌రు. క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం అంటూ శ్రీరెడ్డి అంత‌టి పాపులారిటీని సంపాదించుకుంది.

Advertisement

నేష‌న‌ల్ మీడియాలో సైతం శ్రీరెడ్డి వార్త‌లు రావ‌డంతో ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. అంతే కాకుండా టాలీవుడ్ లో పలువురు న‌టీన‌టులపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. స్టార్ హీరోల‌పై కూడా ఆరోప‌ణ‌లు చేసింది. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల హైద‌రాబాద్ నుండి చెన్నై కి మ‌కాం మార్చిన శ్రీరెడ్డి ఓ యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా అటు సినిమాల‌పై ఇటు రాజ‌కీయ అంశాల‌పై త‌నదైన రీతిలో స్పందిస్తూ ఉంటుంది.

Advertisement

ఇటీవ‌ల జ‌నసేన ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మాట్లాడుతూ మ‌ధ్య‌లో చంద్ర‌బాబు ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చింది. చంద్ర‌బాబు టీడీపీలో త‌న ఆధిప‌త్య‌మే కొన‌సాగాల‌ని భావిస్తున్నారు అందువల్లే టీడీపీ నేత‌లు జూనియ‌ర్ ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీని కోరుకుంటున్నార‌ని వ్యాక్యానించింది. ఎన్టీఆర్ ను చంద్ర‌బాబు తొక్కేశారు అంటూ శ్రీరెడ్డి మండిప‌డింది.

అంతే కాకుండా ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పోలిస్తే ఎన్టీఆర్ చాలా గ్రేట్ అంటూ శ్రీరెడ్డి పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించింది. ఎన్టీఆర్ అంటే ఎందుకు న‌చ్చ‌ట్లేదు..బాలయ్య బాబు చేసిన త‌ప్పేంటి. అత‌నికి లేని పాపులారిటీ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఉన్న పాపులారిటీ ఏంటని శ్రీరెడ్డి ప్ర‌శ్నించింది. బాల‌కృష్ణ సీఎం అభ్యర్థి కానీ ఆయ‌న‌ను వియ్యంకుడిని చేసుకుని తొక్కేశారు అంటూ విరుచుకుప‌డింది. అంతే కాకుండా ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రాకుండా భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారంటూ మండిప‌డింది.

Visitors Are Also Reading