టీం ఇండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ జట్టులో ఈసారి ఇద్దరు తెలుగు ఆటగాళ్లు ఉన్నారు. అందులో ఒక్కరు హనుమ విహారి కాగా మరొకరు యువ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్. ఇదిలా ఉంటె ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్లుగా శుభ్ మన్ గిల్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా వచ్చాడు. కానీ ఈ ఇద్దరు త్వరగానే పెవిలియన్ చేరుకున్నారు. అయితే ఇదే ఇన్నింగ్స్ లో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చిన తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ రాణించాడు.
Advertisement
జట్టు చాలా క్లిష్ట పరిస్థితులో ఉన్నప్పుడు బ్యాటింగ్ కు వచ్చిన భరత్ చాలా మెచ్యూరిటీని చూపించాడు. అలాగే పరిస్థితులకు తగ్గలుగా బ్యాటింగ్ చేసాడు. 87 బంతుల్లో 76 పరుగులు చేసి ఈ ఇన్నింగ్స్ లో టీం ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దాంతో రెండో ఇన్నింగ్స్ వచ్చేసరికి కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్ గా తాను వెళ్లకుండా గిల్ తో భరత్ ను పంపించాడు. అయితే ఈ ఇన్నింగ్స్ లో రెగ్యులర్ ఓపెనర్ అయిన గిల్ మళ్ళీ నిరాశపరచగా… భరత్ మాత్రం మళ్ళీ రాణించాడు. ఈ రెండో ఇన్నింగ్స్ లో 98 బంతుల్లో 43 పగలు చేసాడు.
Advertisement
దాంతో భరత్ మంచి టెస్ట్ బ్యాటర్ గా నిరూపించుకున్నాడు. అందులో ఈ రెండో ఇన్నింగ్స్ లో చేసిన ప్రయోగానే టెట్ మ్యాచ్ లో కూడా చేయాలనీ కెప్టెన్ రోహిత్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఓపెనర్ గా విఫలమవుతున్న గిల్ ను మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు పంపించి అక్కడ బ్యాటింగ్ చేస్తున్న భరత్ ను ఓపెనర్ గా దించాలని భావిస్తున్నాడట. భరత్ తనలో నిలకడగా.. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయగల సామర్ధ్యం ఉంది అని ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో నిరూపించుకోవడంతో… రోహిత్ ఈ విధమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :