టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తన భార్య ఊహతో విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వీరు పెళ్లి చేసుకుని దాదాపు 25 ఏళ్లు అవుతోంది. పాతికేళ్ల కాలంలో వీరి గురించి ఎలాంటి వార్తలు వినిపించలేదు. తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై శ్రీకాంత్ స్పందించారు. ” తనూ – ఊహ విడాకులు తీసుకుంటున్నట్టు కొన్ని వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాయి. ఇలాంటి పుకార్లను నేను తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాను. ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను అసలు ఎవరు పుట్టిస్తున్నారు ? ఎందుకు పుట్టిస్తున్నారో అర్థం కావడం లేదు. గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు.
Advertisement
తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కొన్ని వెబ్ సైట్స్ లలో వచ్చిన ఈ ఫేక్ న్యూస్ ను తన ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తను కంగారుపడుతూ ఆ పోస్టులను నాకు చూపించింది. ఇలాంటివి ఏమాత్రం నమ్మద్దు..ఆందోళన పడవద్దు అని తనను ఓదార్చాను . ఏవో కొన్ని చిల్లర వెబ్ సైట్స్, యూ ట్యూబ్ చానల్స్ వాళ్ళు చేసిన ఈ పని సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవ్వడంతో బంధుమిత్రులందరూ ఫోన్ చేసి అడుగుతుంటే వివరణ ఇచ్చుకోవడం పెద్ద న్యూసెన్స్ గా అనిపిస్తుంది.
Advertisement
Also Read : “నువ్వేకావాలి” సినిమా హీరోయిన్ రిచా ఇప్పుడు ఎలా ఉందో…? ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా….?
ప్రస్తుతం నేనూ ఊహ నిన్న చెన్నై వచ్చి ఇక్కడి నుంచి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నాం. ఇలాంటి తరుణంలో ఈ రూమర్స్ మా కుటుంబానికి చాలా చిరాకు తెప్పిస్తుంది. ఇది ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాను. నా మీదనే కాకుండా చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి నిరాధారమైన పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ” అంటూ హీరో శ్రీకాంత్ ఆ రూమర్స్ ని తీవ్ర స్థాయిలో ఖండించారు.
Also Read : యాంకర్ అనిత చౌదరికి హీరో శ్రీకాంత్ మధ్య రిలేషన్ ఏంటంటే..?