Home » వైఎస్ జగన్ పైన శ్రీ రెడ్డి లేటెస్ట్ పోస్ట్ వైరల్..! “మీరేమి ఇవ్వకున్నా నేను”.. అంటూ ఏమన్నదంటే ?

వైఎస్ జగన్ పైన శ్రీ రెడ్డి లేటెస్ట్ పోస్ట్ వైరల్..! “మీరేమి ఇవ్వకున్నా నేను”.. అంటూ ఏమన్నదంటే ?

by Anji
Ad

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి టీడీపీ తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా 4 ఎమ్మెల్సీ సీట్లను దక్కించుకుంది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ఇదే ఊపులో వచ్చే ఎన్నికల్లో కూడా విజయదుందుబి మోగించాలనుకుంటుంటే.. మరోవైపు వైసీపీ మాత్రం మీకు అంత సీన్ లేదని, 175 స్థానాలు మావే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.  

Also Read :   సంచ‌ల‌న నిర్న‌యం తీసుకున్న నాగార్జున‌….ఫ్యామిలీలో ఒకేసారి మూడు పెళ్లిళ్ల‌కు ముహూర్తం..?

Advertisement

వైసీపీలో ఉంటూనే ప్రతిపక్షానికి కొమ్ముకాస్తున్న నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో విషపురుగులతో పోల్చుతూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ చేసింది వైసీపీ వీర విధేయురాలు శ్రీరెడ్డి. “ మీ ఆశయాల మీద నమ్మకంతో మీరు ఏమి ఇవ్వకున్నా.. మీ మీద ప్రేమతో మీతోనే నడిచేవాళ్లం మేమంతా.. విష పురుగులు విషమే తప్ప అమృతాన్ని కురిపిస్తాయా జగన్ అన్నా పదవీ, కోట్లు ఇవ్వకున్నా మిమ్మల్ని నమ్మి కోట్ల మంది ఉన్నారు. చంద్రబాబుని నమ్మి విషపురుగులు మాత్రమే ఉంటాయి. జై జగన్” అంటూ పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.

Advertisement

 

వైసీపీకి అనుకూలంగా పోస్ట్ లు చేసే శ్రీరెడ్డికి పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేదు. ప్రచారంలో మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని తిట్టించడానికి శ్రీరెడ్డిని వైసీపీ అస్త్రంగా ఉపయోగిస్తున్నారని అందుకు ఆమెకు కోట్ల రూపాయలు ఇస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాను మాత్రం.. పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, ఎవ్వరూ తనను సంప్రదించలేదని చెప్పుకొచ్చింది. కేవలం సీఎం జగన్ మోహన్ రెడ్డితో ఉన్న అభిమానంతోనే పార్టీకి సేవ చేస్తున్నాను అని, డబ్బు కోసమో, పదవి కోసమో కాదు అని తెలిపింది. ‘మీరు ఏమి ఇవ్వకపోయినా మీతోనే ఉన్నాం’ అని గుర్తు చేసింది శ్రీరెడ్డి. ఇక ఇప్పటికైనా వైసీపీ శ్రీరెడ్డి సేవలను గుర్తిస్తుందో లేదో వేచి చూడాలి. 

Also Read :  Sri Rama Navami 2023 Wishes, Quotes, Images, Greetings in Telugu, శ్రీరామ నవమి శుభాకాంక్షలు.. బంధువులకు, కుటుంబ సభ్యులకు ఇలా చెప్పండి..!

Visitors Are Also Reading