Home » వాట్సప్ చాట్ బయటపెట్టిన శ్రీజ.. సంచలన విషయాలు వెలుగులోకి..!!

వాట్సప్ చాట్ బయటపెట్టిన శ్రీజ.. సంచలన విషయాలు వెలుగులోకి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మెగాస్టార్ ముద్దుల కూతురు శ్రీజ కళ్యాణ్ దేవ్ గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. కళ్యాణ్ దేవ్ మరియు శ్రీజ విడివిడిగా ఉండటంతో వీరిద్దరు విడాకులు కూడా తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇదే విషయంపై ఇటు శ్రీజా కానీ అటు కళ్యాణ్ దేవ్ కానీ స్పందించడం లేదు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీలో ఏ ఒక్కరు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.

Advertisement

అలాగే మెగా ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్ లకు కూడా కళ్యాణ్ దేవ్ హాజరు కావడం లేదు. దీనితో వారిద్దరు విడిపోతున్నారు అనే వార్తలకు బలం చేకూరింది. ఇదిలా ఉండగా తాజాగా శ్రీజ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్టులో స్క్రీన్ షాట్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ స్క్రీన్ షాట్ లో తాను చెప్పిన విషయాలు తన కూతురు చాటింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. తనకు జన్మనిచ్చిన తల్లికి గుడ్ మార్నింగ్ అంటూ ఓ మెసేజ్ ను నివృత్తి పెట్టగా, దానికి నవ్వుతున్న ఎమోజిని రిప్లై గా ఇచ్చింది శ్రీజ.

Advertisement

అమ్మ నేను నీకేం నేర్పించానో మర్చిపోయావా ఆ ఏమోజి నాకు నచ్చలేదు బాగాలేదు అన్నట్టుగా మెసేజ్ పెట్టింది. మళ్లీ రిప్లై పెట్టు అమ్మ అంటూ ఆ మెసేజ్ లో ఉంది. అప్పుడు శ్రీజ మేమంతా కూడా పాతకాలం మనుషులం కదా.. అని రిప్లై ఇవ్వడంతో హహహ అని నవ్వుతున్నట్లుగా మెసేజ్ పెట్టేసింది. ఈ విధంగా పొద్దు పొద్దున్నే ఇద్దరు చాటింగ్ చేసేసుకున్నారు. ప్రస్తుతం శ్రీజ పిల్లలు నివృత్తి,నవిష్కలతో కలిసే ఉంటుంది.

also read:

Visitors Are Also Reading