Telugu News » Blog » మెగాడాట‌ర్ విడాకుల అంశంపై కొత్త అనుమానాలు…!

మెగాడాట‌ర్ విడాకుల అంశంపై కొత్త అనుమానాలు…!

by AJAY
Ads

మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ క‌ల్యాణ్ ఇటీవ‌ల త‌న సోష‌ల్ మీడియాలో పేరును శ్రీజ కొనిదెల‌గా మార్చుకున్న సంగ‌తి తెలిసిందే. దాంతో అప్ప‌టికే శ్రీజ త‌న భ‌ర్త‌తో విడాకులు తీసుకుంటుందని వస్తున్న వార్త‌ల‌కు బ‌లం చేకూరింది. త్వ‌ర‌లోనే విడాకుల కోసం ఈ జంట కోర్టు మెట్లు ఎక్క‌బోతుంటూ టాలీవుడ్ లో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. దానికి తోడు క‌ల్యాణ్ దేవ్ హీరోగా తెర‌కెక్కిన సూప‌ర్ మ‌చ్చి సినిమా సంక్రాంతికి విడుద‌ల కాగా మెగా ఫ్యామిలీ నుండి ఎలాంటి స‌పోర్ట్ ల‌భించ‌లేదు.

Ads

SREEJA INTO BIGG BOSS OTT

మ‌రోవైపు విడాకుల వార్త‌లు గ‌ట్టిగానే వినిపిస్తూన్నా మెగాఫ్యామిలీ మౌనంగానే ఉంటోంది. దాంతో వీరిద్ద‌రి విడాకులు దాదాపు క‌న్ఫామ్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో శ్రీజ రీసెంట్ గా త‌న సోద‌రుడు రామ్ చ‌ర‌ణ్ తో హాలివుడ్ ట్రిప్ కు వెళ్లింది. ఈ సంద‌ర్భంగా ఆమె హగ్స్ ఇవే నన్ను బ్ర‌తికిస్తున్నాయి అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. దాంతో శ్రీజ విడాకుల‌పై కొత్త రూమ‌ర్స్ పుట్టుకువ‌స్తున్నాయి.

Ads

విడాకుల నేప‌థ్యంలో శ్రీజ డిప్రెష‌న్ లోకి వెళ్లింద‌ని అందువ‌ల్లే ఆమెను చ‌ర‌ణ్ హాలిడే ట్రిప్ కు తీసుకువెళ్లార‌ని క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు శ్రీజ ఇవే నన్ను బ్ర‌తికిస్తున్నాయి అంటూ కామెంట్లు చేయ‌డంతో క‌ల్యాణ్ దేవ్ ఆమెను ఏమైనా వేధించారా…ఎందుకు అంత‌లా ఎమోష‌న‌ల్ అవుతోంది. అస‌లు విడాకులు ఎందుకు తీసుకుంటోంది.

Ramcharan sreeja kalyan

Ramcharan sreeja kalyan

ఇద్ద‌రూ ఇష్టంతో పెళ్లి చేసుకున్నారు. ఓ కూతురుకు జ‌న్మనిచ్చారు. బిడ్డ‌పుట్టిన ఏడాదిలోనే ఏం జ‌రిగింది. ఎందుకు దూర‌మ‌య్యారు. ఇలా ర‌క‌రకాల ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఏది ఏమైనా ఇప్ప‌టికే టాలీవుడ్ లో స‌మంత నాగ‌చైత‌న్య‌ల విడాకుల వార్తను జీర్ణించుకోలేక‌పోతున్న నెటిజ‌న్లు శ్రీజ క‌ల్యాణ్ దేవ్ విడిపోవ‌ద్ద‌ని కోరుకుంటున్నారు.

Ad

ALSO READ : వైరల్ అవుతున్న అల్లు అర్జున్ చెప్పులు…ఆ పాటతో లింక్ చేస్తూ ట్రోల్స్….!