Home » వైరల్ అవుతున్న అల్లు అర్జున్ చెప్పులు…ఆ పాటతో లింక్ చేస్తూ ట్రోల్స్….!

వైరల్ అవుతున్న అల్లు అర్జున్ చెప్పులు…ఆ పాటతో లింక్ చేస్తూ ట్రోల్స్….!

by AJAY
Ad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా పుష్ప. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇప్పటికే ఆర్య, ఆర్య -2 లాంటి సూపర్ హిట్ సినిమాలు రాగా పుష్ప సినిమాతో వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ కొట్టారు. పాన్ ఇండియా లెవల్ లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందాయి. ఈ సినిమాలోని నటీనటుల వేషధారణ నటన ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

Advertisement

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక నటించగా ఈ చిత్రంలో సమంత మొట్టమొదటిసారిగా ఐటమ్ సాంగ్ చేసింది. ఊ అంటావా ఉ ఊ అంటావా అనే పాటకు సమంత వేసిన స్టెప్పులు కుర్రాళ్ళ మతి పోగొట్టాయి. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా క్రేజ్ రావడంతో పాటు సమంత సాంగ్ తో పాటు సినిమాలోని శ్రీవల్లి సాంగ్ కూడా ఎంతో పాపులర్ అయింది. ముఖ్యంగా శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

Advertisement

Pahpha Srivalli song

ఇక పాటలో అల్లు అర్జున్ చెప్పు ఊడిపోయినట్టు చేసి మళ్ళీ తిరిగి చెప్పును వేసుకుంటాడు. దాంతో చాలామంది ఈ స్టెప్ కు ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారు. ఇక తాజాగా అల్లు అర్జున్ శ్రీవల్లి పాటకు వాడిన చెప్పులు ఇవే అంటూ ఒక జత చెప్పులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అల్లుఅర్జున్ శ్రీవల్లి పాట కోసం ప్రాక్టీస్ చేసి చేసి ఈ చెప్పులు అరిగిపోయాయి అంటూ ఆ ఫోటో ను వైరల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ ను నెటిజన్లు సైతం ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు సుకుమార్ అల్లు అర్జున్ పుష్ప పార్ట్-2 కు రెడీ అవుతున్నారు. త్వరలోనే పార్ట్- 2 ను చిత్రీకరించి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

Also read : అఖండలో మరో మిస్టేక్…బోయపాటి పై ట్రోల్స్…!

Visitors Are Also Reading