అలనాటి కాలంలో సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగు లేని స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆయన స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలో ఆయనతో సినిమాలో ఏదైనా ఒక్క చిన్న పాత్రలోనైనా నటించాలని ఎంతో మంది దిగ్గజ నటీనటులు కూడా అనుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే కొంత స్టార్ డమ్ ఉన్న హీరోలు కూడా ఎన్టీఆర్ తో మంచి క్యామియో ఉన్న పాత్రలో నటించాలని భావించిన వారు అనేకమంది ఉన్నారు.
Advertisement
అలాంటి వారిలో చంద్రమోహన్ ఒకరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్న సమయంలో చంద్రమోహన్ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి జోష్ లో తన కెరీర్లు ముందుకు సాగిస్తున్నాడు. అలా తనకు వరుసగా సినిమాలు వస్తూ … అందులో చాలా వరకు విజయాలను సాధిస్తున్నప్పటికీ అతనికి ఎన్టీఆర్ తో ఫుల్ లెన్త్ లో ఒక సినిమా చేయాలని ఉండేదట. అందులో భాగంగా చాలా రోజులు వెయిట్ చేశాడట. ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో చిన్నా చితక ఆఫర్లు వచ్చినప్పటికీ ఆయన అనుకున్న ప్రకారం సీనియర్ ఎన్టీఆర్ పక్కన ఫుల్ లెన్త్ పాత్రలో నటించాలి అనే ఆయన కోరిక మాత్రం నెరవేరలేదు.
Advertisement
ఇలా ఆయన అనుకున్న పాత్ర ఆయనకు రాకపోవడంతో సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సమయంలో ఆయనను నేరుగా వెళ్లి నేను ఒక సినిమాను చేద్దాం అనుకుంటున్నాను. అందులో మీరు హీరోగా నటించాలి. అందులో మీకు తమ్ముడుగా ఒక పాత్ర ఉండే విధంగా కథను తయారు చేసుకున్నాను. మీరు ఆ మూవీలో హీరోగా నటించాలి అని అడిగాడట.
దానికి సీనియర్ ఎన్టీఆర్ నువ్వు పొట్టివాడవే అనుకున్నాను ఇప్పుడే తెలిసింది నువ్వు చాలా గట్టి వాడివి అని చెప్పి ఎన్టీఆర్ కథ మొత్తం విని తదుపరి మూవీ నీతోనే చేస్తాను అని అతనికి మాట ఇచ్చి పంపాడట. కాకపోతే చంద్రమోహన్ కు ఇచ్చిన మాట ప్రకారం సీనియర్ ఎన్టీఆర్ అతనితో సినిమా చేయలేదు.