Home » 24 ఇడ్లీలు, 30బ‌జ్జీలు…ఎన్టీఆర్ ఫుడ్ మెనూ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

24 ఇడ్లీలు, 30బ‌జ్జీలు…ఎన్టీఆర్ ఫుడ్ మెనూ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

by AJAY
Published: Last Updated on

సినిమా రంగంతో పాటూ రాజ‌కీయ‌రంగంలోనూ చెర‌గ‌ని ముద్ర‌వేసుకున్న మ‌హ‌నీయుడు ఎన్టీరామారావు. ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో నిలిచిపోయారు. పౌరాణిక పాత్ర‌ల‌తో సాక్షాత్తూ దేవుడి రూపంలో క‌నిపించారు. త‌న న‌ట‌న‌తో కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఇక రాజ‌కీయాల విష‌యానికి వ‌స్తే తెలుగు దేశం పార్టిని స్థాపించి ముఖ్యమంత్రి స్థానాన్నిఅధిష్టించారు.

Also Read: కెరీర్ ప్రారంభంలోనే ఒకే ఏడాది హ్యాట్రిక్ హిట్ కొట్టిన‌ నంద‌మూరి హీరో ఎవ‌రో తెలుసా..?

 

సీఎంగా ప్ర‌జ‌ల‌కు ఎంతో సేవ చేశారు. పేద‌ల సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ ప్ర‌తివిష‌యంలోనూ ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉండేవారు. అంతే కాకుండా ఆయ‌న సినిమా రాజ‌కీయ రంగాల్లో రాణించడానికి ఆయ‌న క్ర‌మ‌శిక్ష‌ణ కూడా ఒక కార‌ణం అనే చెప్పాలి. ఇక కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్ ఉద‌యం ఏడు గంట‌ల నుండి మ‌ద్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కూ ఆ త‌ర‌వాత మ‌ద్యాహ్నం రెండు గంట‌ల నుండి రాత్రి తొమ్మిది గంట‌ల వ‌ర‌కూ షూటింగ్ లో పాల్గొనే వార‌ట‌.

ఆ త‌ర‌వాత షిఫ్ట్ స‌మయాన్ని కూడా త‌గ్గించుకుని కేవ‌లం ఉద‌యం తొమ్మిది గంట‌ల నుండి సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కూ షూటింగ్ లో పాల్గొనేవార‌ట‌. ఇదిలా ఉండ‌గా ఎన్టీఆర్ ఆహారపు అల‌వాట్లు కూడా అంద‌ర్నీఆశ్చర్య‌ప‌రిచేవి. ప్ర‌తి రోజూ ఉద‌యం మూడు గంట‌ల‌కే నిద్ర‌లేచేవార‌ట‌. ఆ త‌ర‌వాత వ్యాయామం చేసి స్నానం చేసిన త‌ర‌వాత 24 ఇడ్లీల‌ను తినేవార‌ట‌.

ఆ ఇడ్లీలు కూడా ఇప్పుడు ఉన్న‌వాటిలా చిన్నగా కాకుండా ఒక్కోటి అర‌చేతి మందంలో ఉండేద‌ట‌. ఇక కొంత‌కాలం ఇడ్లీలు మానేసి ఉద‌యాన్నే భోజనం చేయ‌డం మొద‌లు పెట్టారు. భోజ‌నంలో ఖ‌చ్చితంగా మాంసాహారం ఉండేలా చూసుకునేవార‌ట‌. అంతే కాకుండా ప్రతిరోజూ రెండు లీట‌ర్ల బాదం పాల‌ను సైతం తాగేవార‌ట‌. అంతే కాకుండా చెన్నైలో ఎప్పుడైనా బజ్జీలు తినాల‌నిపిస్తే 30నుండి 40బజ్జీల‌ను సుల‌భంగా తినేసేవార‌ట‌.

ALSO READ : బలమైన సెక్యూరిటీ ఉన్నా చనిపోయిన నేతలు.. ! అలా జరగడానికి కారణాలు ఏంటి ?

Visitors Are Also Reading