Home » పిచ్చుకలు మీ ఇంట్లో గూడు కట్టుకున్నాయా.. అయితే వాస్తు ప్రకారం జరిగేది ఇదేనా..?

పిచ్చుకలు మీ ఇంట్లో గూడు కట్టుకున్నాయా.. అయితే వాస్తు ప్రకారం జరిగేది ఇదేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

భారతదేశంలో ఎక్కువ వాస్తును నమ్ముతూ ఉంటారు. వాటిలో కొన్ని పక్షులు మనకు శుభసూచకం అయితే, కొన్ని పక్షుల అశుభసూచకంగా పరిగణిస్తారు. అది పక్షుల్లోనే కాకుండా జంతువుల్లో కూడా ఇలాంటి రూల్స్ మన ఇండియాలో ఉంటాయి. మరి పక్షుల విషయానికి వచ్చినప్పుడు, పక్షులు మన ఇళ్లలో గుళ్ళు కట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా నగరాల్లో పావురాలు బాల్కనీలో గూళ్ళు కట్టుకొని జీవిస్తాయి. సాధారణంగా పిచ్చుకలు చిన్నచిన్న గూళ్ళు కట్టుకొని అందులో జీవిస్తూ ఉంటాయి.

Advertisement

ఒక్కోసారి మన ఇంటి పరిసరాల్లోనే ఈ పిచ్చుకలు గూళ్లు కట్టుకుని తిరుగుతూ ఉంటాయి. మరి పిచ్చుకలు ఇలా గూళ్ళు కట్టుకొని తిరగడం వల్ల మనకి ఏమైనా సమస్యలు వస్తాయా.. దీనిపై వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పిచ్చుక గూడు కట్టుకుంటే కొన్ని రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయని నిపుణులు అంటున్నారు.
1.ఇంటికి తూర్పు దిక్కున గూడు కట్టుకుంటే గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

Advertisement

2. ఇంటికి ఆగ్నేయ దిశలో పిచ్చుక గూడు కట్టుకుంటే అది ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగబోతుందని తెలుపుతుంది.
3. ఇప్పుడు దక్షిణ దిశలో కట్టుకుంటే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది.
4. అలాగే నైరుతిదిశలో పిచ్చుక గూడు కట్టుకుంటే మీ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం కాకుండా అధిక ధనలాభం ఉంటుంది.దీంతోపాటుగా కుటుంబ సభ్యులు యొక్క జీవితకాలం కూడా పెరుగుతుంది.
5. ఈ విధంగా పిచ్చుక గూడు కట్టుకొని మన ఇంట్లోకి రావడం వల్ల గ్రామాల్లో అయితే పంటలు బాగా పండుతాయని భావిస్తూ ఉంటారు.

ALSO READ:

Visitors Are Also Reading