Home » అందుకే భారత్ ప్రపంచ కప్స్ ఓడిపోయింది..!

అందుకే భారత్ ప్రపంచ కప్స్ ఓడిపోయింది..!

by Azhar
Ad

టీం ఇండియా ఇప్పటివరకు కేవలం నాలుగు ఐసీసీ టైటిల్స్ ను మాత్రమే సాధించింది. అందులో 2007 లో చివరి టీ20 ప్రపంచ కప్, 2011 లో చివరి వన్డే ప్రపంచ కప్, 2013 లో చివరి ఛాంపియన్స్ ట్రోఫీ అనేది గెలిచింది. అయితే ఈ మూడు టైటిల్స్ కూడా ధోని కెప్టెన్సీలోనే టీం ఇండియా అందుకుంది. ఆ తర్వాత ధోని వారసుడిగా విరాట్ కోహ్లీ కెప్టెన్ అయ్యాడు. కానీ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు ఒక్క ప్రపంచ కూడా గెలవలేకపోయింది. కోహ్లీ కెప్టెన్ గా రవిశాస్త్రి హెడ్ కోచ్ గా విదేశీ పర్యటనలో సిరీస్ లు గెలిచిన భారత జట్టు ఐసీసీ టోర్నీలో మాత్రం గెలవలేకపోయింది.

Advertisement

అయితే తాజాగా ఈ విషయంపై రవిశాస్త్రి మాట్లాడుతూ సెలక్టర్ల నిర్లక్ష్యం వల్లే మేము రెండు ప్రపంచ కప్పులు ఓడిపోయాం అని అన్నారు. అయితే 2019 ప్రపంచ కప్ సమయంలో వెన్నుముఖ్య నొప్పితో భాదపడుతున్న హార్దిక్ పాండ్య ఆ తర్వాత 2021 ప్రపంచ కప్ సమయంలో అసలు ఫిట్ గా లేడు. అయిన కూడా సెలక్టర్లు అతడిని జట్టులోకి తీసుకోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది. దీనిపైన ఫ్యాన్స్ కూడా బీసీసీఐని ట్రోల్ చేసారు. ఇప్పుడు రవిశాస్త్రి కూడా ఇదే విషయం చెబుతున్నారు.

Advertisement

రెండు ప్రపంచ కప్స్ కు ముందు హెది పాండ్య ఫిట్ గా లేడు. అందువల్ల వేరే ఫాస్ట్ బౌలర్ ఆల్ రౌండర్ కావాలని మేము సెలక్టర్లకు చెబుతూనే వచ్చాము. ఎందుకంటే ప్రపంచ కప్ వంటి టోర్నీలలో ఐదు బౌలింగ్ అపశ్యన్స్ తో వెళ్లి గెలవాలి అంటే చాలా కష్టం. అందుకే మేము ఇంకో ఆల్ రౌండర్ కావాలి అంటే.. సెలక్టర్లను మా మాటను పట్టించుకోలేదు అని రవిశాస్త్రి అన్నారు. అయితే ఈ రెండు టోర్నీలలో పాండ్య ఫిట్ గా ఉన్న.. లేక మరో ఆల్ రౌండర్ ఉన్న మేము ప్రపంచ కప్ లో టైటిల్ సాధించేవాళ్ళం అని రవిశాస్త్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి :

ధావన్ ను అసలు జట్టులోకి ఎలా తీసుకున్నారు…?

పాండ్య రిటైర్మెంట్ ఇస్తాడు అని చెప్పిన రవిశాస్త్రి..!

Visitors Are Also Reading