భారత వ్యవసాయ రంగానికి శుభవార్త చెప్పింది భారత వాతావరణ శాఖ. ముఖ్యంగా భారత్‌లో వర్షాలకు అత్యంత కీలకంగా భావించే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే రానున్నాయి. భారత వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాధారంగా భావించే నైరుతి ఋతుపవనాలు మే 27న కేరళను తాకనున్నట్టు ఐఎండీ వెల్లడించింది.
Advertisement
ఈ ఏడాది దేశంలో ముందస్తు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కేరళలో సాధారణంగా జూన్ 01 ఋతుపవనాలు ప్రారంభం అయినా మొదటి, రెండవవారంలో రుతుపవనాలు ఎక్కువ శాతం విస్తరిస్తుంటాయి. ఈ ఏడాది మే చివరి నాటికే కేరళ తీరాన్ని నైరుతి ఋతుపవనాలు తాకనన్నాయి. ప్రస్తుతం దేశంలో వేసవి తీవ్రత వడగాలులు ఎక్కువగా ఉన్నాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటుతున్నాయి. రుతుపవనాలు ఎంట్రీ వల్ల ఉష్ణోగ్రతలు దాదాపు తగ్గే అవకాశం ఏర్పడనుంది. వేసవి తాపం నుండి రుతుపవనాలు ఉపశమనం ఇవ్వనున్నాయి.
Advertisement
ఇదిలా ఉండగా.. నైరుతి రుతుపవనాల వల్ల అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో మే 15న తొలకర జల్లులు కురిసే అవకాశముంది. సాధారణ అంచనా తేదీ కన్నా నాలుగు రోజులు ముందస్తుగానే ఈక్వటోరియల్ గాలుల కారణంగా దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో మే 15 నాటికి నైరుతి ఋతుపవనాలు ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులు ఉంటాయని ఐఎండీ వెల్లడించింది. దేశంలో 99 శాతం వర్షపాతం నమోదు అవుతుందని ఐఎండీ వెల్లడించింది.
Also Read :
భార్య శవంతో 21 ఏళ్లుగా సహజీవనం..చివరికి ఏమైందంటే..?
సౌత్ ఇండస్ట్రీపై రిచా చద్దా సంచలన వ్యాఖ్యలు..!