Telugu News » సౌత్ ఇండస్ట్రీపై రిచా చ‌ద్దా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

సౌత్ ఇండస్ట్రీపై రిచా చ‌ద్దా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

by Anji

ప్ర‌స్తుతం బాలీవుడ్ చూపు మొత్తం టాలీవుడ్ మీదే ఉందంటే అతిశ‌యోక్తి కాదు. బాలీవుడ్‌లో ఒక్కో సినిమా యావ‌రేజ్ అనిపించుకోవడానికే క‌ష్ట‌ప‌డుతుంటే సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవ‌ల్‌లో భారీ విజ‌యాల‌ను అందుకొంటున్నాయి. హిందీ తార‌లు.. సౌత్ ఇండ‌స్ట్రీపై త‌మ కోపాన్ని వెళ్ల‌గ‌గ్గుతున్నారు. గ‌త కొన్ని రోజులుగా నార్త్‌-సౌత్ మధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న విష‌యం విధిత‌మే. తాజాగా ఈ వివాదం గురించి బోల్డ్ బ్యూటీ త‌న‌దైన రీతిలో స్పందించింది. ష‌కీలా బ‌యోపిక్ తో తెలుగు వారిని సైతం త‌న అంద‌చందాల‌తో ఆక‌ట్టుకున్న హాట్ బ్యూటీ రిచా చ‌ద్దా సౌత్ సినిమాలు భారీ క‌లెక్ష‌న్ల‌ను సాధించ‌డంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

Ads

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. సౌత్ సినిమాల టికెట్స్ రేట్లు రూ.100 నుంచి 400 లోపు మాత్ర‌మే ఉంటాయి. పెద్ద సినిమాలు వ‌చ్చిన‌ప్పుడు త‌గ్గుతుంటాయి. చిన్న సినిమాలు వ‌చ్చిన‌ప్పుడూ త‌గ్గుతుంటాయి. త‌మ అభిమాన హీరోల సినిమాలు కాబ‌ట్టి అభిమానులు ఎంత రేట్ అయినా కొని సినిమా చూస్తారు. ఎందుకంటే అక్క‌డ ఫ్యాన్స్ బేస్ ఎక్కువ ఉంటుంది. అందుకే వారికి భారీ ఓపెనింగ్స్ వ‌స్తాయి. బాలీవుడ్‌లో అలా కాదు.. సినిమా ఏదైనా టికెట్ ధ‌ర రూ.500 పైనే ఉంటుంది. ప్రేక్ష‌కుడు టికెట్ కొని సినిమా చూడ‌డానికి ధైర్యం చేయ‌డు.

ప్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమా ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంటుంది. ఆ డ‌బ్బుతో ఇంట్లో స‌రుకులు తెచ్చుకోవ‌చ్చు అని మ‌ధ్య త‌ర‌గ‌తి వారు ఆలోచిస్తారు. బాలీవుడ్‌లో డిస్ట్రిబ్యూట‌ర్స్ అత్యాశ వ‌ల్ల హిందీ సినిమా న‌ష్ట‌పోతుంది. సినిమా నిల‌దొక్కుకోవాలంటే వ్యాపారంలో పెద్ద వాటాదారులు బాధ్య‌త వ‌హించాల‌ని రిచా అభిప్రాయ‌ప‌డింది. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Also Read : 

ట్విట్ట‌ర్ డీల్ హోల్డ్ అంటున్న ఎల‌న్ మ‌స్క్‌..!

బాలయ్య కూతురు పెళ్లిలో ఎన్టీఆర్ ను అంతలా అవమానించారా…? అసలేం జరిగిందంటే..!


You may also like