Telugu News » బ్యాడ్ హాబిట్స్ ఉన్న సౌత్ ఇండియ‌న్ స్టార్స్ వీరే..!

బ్యాడ్ హాబిట్స్ ఉన్న సౌత్ ఇండియ‌న్ స్టార్స్ వీరే..!

by AJAY MADDIBOINA

సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రికీ మంచి అల‌వాట్లు చెడు అల‌వాట్లు ఉంటాయి. కొంత‌మంది స‌ర‌దాగా చేసిన ప‌నులు ఆ త‌ర‌వాత అలవాట్లుగా మారిపోతాయి. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు మాత్రమే కాకుండా సెలబ్రెటీల‌కు సైతం అలా మంచి అలవాట్లు చెడు అల‌వాట్లు ఉంటాయి. అలా చెడు అల‌వాట్లు ఉన్న సెల‌బ్రెటీలు ఎవ‌రో ఇప్ప‌డు చూద్దాం…

Ads

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబుకు కూడా ఓచెడు అల‌వాటు ఉండేది. మ‌హేశ్ బాబు ఒక్క‌ప్పుడు చైన్ స్మోక‌ర్ గా ఉండేవార‌ట‌. త‌ర‌చూ సిగ‌రెట్లు తాగేవార‌ట‌. కానీ ఇప్పుడు ఆయ‌న పూర్తిగా సిగరెట్ల‌కు దూరంగా ఉంటున్నారు.

Vijay

సౌంత్ ఇండియ‌న్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో ద‌ళ‌ప‌తి విజయ్. త‌మిళ సినిమాల‌తో పాటూ విజ‌య్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా తెలుగు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి విజ‌య్ తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ కి రాష్ డ్రైవింగ్ చేసే అల‌వాటు ఉంద‌ట‌. ఖ‌రీదైన కార్లు ఉన్న విజ‌య్ రాష్ డ్రైవింగ్ చేసి అనేక‌సార్లు నోటీసులు కూడా అందుకున్నార‌ట‌.

మ‌రో త‌మిళ హీరో సూర్య‌కు తెలుగులోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సూర్య చేసిన ప‌లు చిత్రాలు టాలీవుడ్ లోనూ మంచి విజ‌యం సాధించాయి. అయితే సూర్య‌కు దుస్తులు మార్చే బ్యాడ్ హాబిట్ ఉంద‌ట‌. ఒక్క ఫంక్ష‌న్ కు వెళితే సూర్య దాదాపు ప‌ది డ్రెస్సులు మారుస్తార‌ట‌.

సూపర్ స్టార్ ర‌జినీకాంత్ కు కూడా ఓ బ్యాడ్ హాబిట్ ఉందట‌. ర‌జినీకాంత్ ఎక్కువ‌గా సిగ‌రెట్లు కాలుస్తార‌ట‌. మానేయ‌డానికి ప్ర‌య‌త్నించినప్ప‌టికీ ఆ అల‌వాటు నుండి ర‌జినీ బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోయార‌ట‌.

బాహుబలి సినిమాలో విలన్ గా నటించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రానా దగ్గుబాటి కి కూడా సిగరెట్ అలవాటు ఉండేదట. అయితే ప్రస్తుతం రానా ఆ అలవాటుకు పులిస్టాప్ పెట్టారట.

also read :ఆలీ ప‌క్క‌న న‌టించ‌న‌ని చెప్పిన సౌంద‌ర్య‌…సంచ‌లన నిజాలు బ‌య‌ట‌పెట్టిన ఎస్వీ కృష్ణారెడ్డి..!

 


You may also like