Home » దక్షిణాఫ్రికాకు శుభవార్త.. మూడేళ్ల తరువాత ఆ క్రికెటర్ రీ ఎంట్రీ..!

దక్షిణాఫ్రికాకు శుభవార్త.. మూడేళ్ల తరువాత ఆ క్రికెటర్ రీ ఎంట్రీ..!

by Anji
Ad

అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నటువంటి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ మళ్లీ జాతీయ జట్టు తరపున ఆడడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 2021లో అనూహ్యంగా రిటైర్ మెంట్ ప్రకటించిన డుప్లెసిస్.. ప్రొటీస్ వైట్ బాల్ జట్టు తరపున ఆడడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి డుప్లెసిస్ తప్పుకున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా పలు ఫ్రాంచైజ్ లీగ్ లలో ఆడుతూనే ఉన్నాడు.

Also Read :   సూపర్ స్టార్ కృష్ణ సినిమా టైటిల్ విషయంలో అంత జరిగిందా..?

Advertisement

చివరిసారిగా డుప్లెసిస్ 2020లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ప్రోటీస్ తరపున ఆడాడు. ప్రోటీస్ వార్త పత్రిక ర్యాప్పోర్ట్ నివేదిక ప్రకారం.. డుప్లెసిస్ ఇప్పటికే సౌతాఫ్రికా కొత్త వైట్ బాల్ కోచ్ రాబ్ వాలర్ట్ కలిసినట్టు సమాచారం. స్వదేశంలో వెస్టిండిస్ తో జరుగబోయే వన్డే, టీ-20 సిరీస్ లలో డుప్లెసిస్ కి చోటు దక్కే అవకాశముంది. ప్రస్తుతం డుప్లెసిస్ అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు. ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా టీ-20 లీగ్ లలో ఫాప్ అదరగొట్టాడు.

Advertisement

Also Read :  టి20 చరిత్రలో టీమిండియాకు అతిపెద్ద విజయం

జోబర్గ్ సూపర్ కింగ్స్ కి సారథ్యం వహించిన డుప్లెసిస్ 369 పరుగులు సాధించాడు. ఏది ఏమైనప్పటికీ డుప్లెసిస్ రీ ఎంట్రీ వార్తతో అభిమానులకు సంతోషకరమైన వార్త అనే చెప్పాలి.  ఇక వెస్టిండిస్ తో వైట్ బాల్ సిరీస్ లకు తమ జట్టును దక్షిణాప్రికా క్రికెట్  రేపు ప్రకటించనుంది. మార్చి 16న ఈస్ట్ లండన్ వేదికగా జరుగనున్న తొలి వన్డేతో ప్రోటీస్-విండీస్ వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది.  ఈ సిరీస్ లో మరీ ఏ జట్టు ప్రతిభ కనబరుస్తుందో వేచి చూడాలి మరి.

Also Read :  INDvsAUS : టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ నుంచి టీమిండియా ఔట్ !

Visitors Are Also Reading