బీసీసీఐపై ఇప్పుడు చాలా మంది భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు అనే విషయం అందరికి తెలిసిందే. అందుకు కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుతం బీసీసీఐ కెప్టెన్ల విషయంలో చేస్తున్న పని కారణంగానే అందరూ బీసీసీఐపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్కపుడు టీం ఇండియా కెప్టెన్ ఎవరు అంటే గంగూలీ, ధోని, కోహ్లీ అని ఇలా ఒక్కే పేరు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అనేది లేదు. విరాట్ కోహ్లీ టీం ఇండియా కెప్టెన్సీ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రోహిత్ శర్మను మూడు ఫార్మాట్లలో కెప్టెన్ గా బీసీసీఐ ప్రకటించింది.
Advertisement
ఇక అప్పటి నుండి రాకరకాల కారణంగా బీసీసీఐ కెప్టెన్లను మారుస్తూనే ఉంది. ఈ ఏడాది ఇప్పటికీ ఏడుగురు కెప్టెన్లను మార్చేసింది. మొదట అందులో రెండో జట్టును చేయడం కారణంగా పాండ్య, ధావన్ ఇలా ఇద్దరు కెప్టెన్లను నియమిస్తే.. ఇక అసలైన కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం కావడం, రెస్ట్ ఇవ్వడం, కరోనా కారణం ఇలాంటి కారణాల వల్ల అతడిని కాకుండా కేఎల్ రాహుల్, పంత్, బుమ్రా ఇలా చాలామంది కెప్టెన్లను నియమించింది. ఇప్పుడు తాజాగా ఇంగ్లాండ్ పర్యాటన తర్వాత వెళ్లనున్న వెస్టిండీస్ టూర్ కోసం ప్రకటించిన వన్డే జట్టులో కూడా ధావన్ ను కెప్టెన్ చేసింది.
Advertisement
అయితే బీసీసీఐ ఇలా ఎందుకు కెప్టెన్లను మారుస్తుంది అనే విషయం పై గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఓ మీడియాతో గంగూలీ మాట్లాడుతూ.. ఇలా కెప్టెన్లను మార్చడం మంచిది కాదు. ఆ విషయాన్ని నేను కూడా అంగీకరిస్తా. కానీ మేము చేసే ఈ పని కావాలని చేస్తుంది కాదు. పరిస్థితుల కారణంగా అలా చేయాల్సి వస్తుంది. సౌత్ ఆఫ్రికా పర్యటనలో రోహిత్ గాయపడుతాడు అని ఎవరు అనుకున్నారు. ఇక ఇండియాలో కేఎల్ రాహుల్ కి గాయం అవుతుంది అని ఊహించారు. అలాగే ఇంగ్లాండ్ లో రోహిత్ కు కరోనా వస్తుంది అని ఎవరైనా అనుకున్నారా..? ఇలా అనుకోకుండానే కెప్టెన్లను మార్చాల్సి వస్తుంది అని దాదా పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :