Home » కోహ్లీ పరుగులు చెయ్యాలా.. అయితే ఇలా చెయ్యండి..!

కోహ్లీ పరుగులు చెయ్యాలా.. అయితే ఇలా చెయ్యండి..!

by Azhar
Ad
టీం ఇండియా మాజీ కెప్టెన్… రన్ మిషన్ గా పేరు తెచ్చుకున్నా విరాట్ కోహ్లీ ఇప్పుడు డీలా పడిపోయాడు. వరుస వైఫల్యాలను ఎదురుకుంటూ ఇప్పుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే గత మూడు సంవత్సరాలుగా సెంచరీ అనేది చేయలేకపోతున్న విరాట్ పై సర్వత్రా విమర్శలు అనేవి వస్తున్నాయి. అయిన కూడా వాటిని పట్టించుకోకుండా పరుగులు చేయడం పై విరాట్ కోహ్లీ ఫోకస్ అనేది చేస్తున్న కూడా సాధ్యం కావడం లేదు. కెప్టెన్సీ వదిలేస్తే కోహ్లీ పరుగులు చేస్తాడు అని అన్నారు. అయితే మూడు ఫార్మాట్లలో కెప్టెన్ గా తప్పుకున్నాడు కోహ్లీ.
కానీ ఆ తర్వాత కూడా పని అనేది జరగలేదు. కనీసం ఐపీఎల్ లో కూడా రాణించలేకపోయాడు. దాంతో కోహ్లీ తీరికలేని క్రికెట్ అనేది ఆడుతున్నాడు. కాబ్బటి అతను రెస్ట్ తీసుకుంటే పరుగులు చేస్తాడు అని అన్నారు. ఆ దారిలోనే ఐపీఎల్ ముగిసిన తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 లో పాల్గొనకుండా… రెస్ట్ తీసుకొని మాల్దీవ్స్ కు వెళ్ళాడు. అక్కడ నుండి తిరిగి వచ్చి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన కోహ్లీ.. ఇంగ్లిష్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కూడా విఫలమయ్యాడు. ఇక ఇప్పుడు అక్కడే ఇంగ్లాండ్ తో వైట్ బాల్ సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ గురించి మరో సలహా అనేది వచ్చింది.
తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్వాన్ మాట్లాడుతూ టీం ఇండియాకు ఓ సలహా ఇచ్చాడు. కోహ్లీ మిడిల్ ఆర్డర్ లో రాణించలేకపోతున్నాడు. అందుకే అతడిని ఓపెనర్ గా పంపించాలని సూచించాడు. కోహ్లీ వంటి ఆటగాడిని ఓపెనర్ గా పంపిస్తేనే బాగుంటుంది. ఎలాగూ టీం ఇండియాకు మిడిల్ ఆర్డర్ లో సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా ఉన్నారు కదా. అందుకే రోహిత్ తో కలిసి విరాట్ ఓపెనింగ్ చేస్తే.. పరుగులు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అని పేర్కొన్నాడు. అయితే నిన్న జరిగిన మొదటి టీ20 లో కోహ్లీ ఆడలేదు. కాబట్టి రేపు జరిగే మ్యాచ్ లో కోహ్లీ ఏ స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడు అనేది చూడాలి.

Advertisement

Visitors Are Also Reading