Home » Soundarya: సౌంద‌ర్య కొడుకు అప్పుడే ఇంత పెద్దోడు అయిపోయాడా?

Soundarya: సౌంద‌ర్య కొడుకు అప్పుడే ఇంత పెద్దోడు అయిపోయాడా?

by Bunty
Ad

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చినటువంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అంతఃపురం సినిమా కూడా ఒకటి. సాయికుమార్ హీరోగా, దివంగత నటి సౌందర్య హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు. ప్రకాష్ రాజ్, జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ సినిమాలో సెంటిమెంట్ చాలా బాగుంటుంది.

Advertisement

ఒక కొడుకు కోసం తల్లి పడే ఆవేదన, పోరాటం ప్రేక్షకులను కట్టిపడేసింది. తల్లిగా సౌందర్య తన నటనతో ఆడియన్స్ ను కన్నీరు పెట్టించింది. ఈ సినిమాలో సౌందర్య కొడుకుగా నటించిన బుడ్డోడి పేరు కృష్ణ ప్రసాద్. ఇతనికి ప్రస్తుతం 27 సంవత్సరాలు. ఈ సినిమాలో నటించే సమయంలో అతని వయసు కేవలం రెండు సంవత్సరాలు. అతి చిన్న వయసులోనే తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేశాడు.

ఈ సినిమా అనంతరం కృష్ణ ప్రసాద్ ఎలాంటి సినిమాల్లోను నటించలేదు. ఈ సినిమా వచ్చి ఇప్పటికీ 25 సంవత్సరాలు అవుతుంది. అంటే కృష్ణ ప్రసాద్ వయసు ఇప్పుడు 27 సంవత్సరాలు. దాదాపు 25 సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కృష్ణ ప్రసాద్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. హీరోలకు మించి మంచి అందం, ఫిజిక్ ఉంది. మరి ఈ హీరో ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తాడో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

BRO : “బ్రో” మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. పవన్ ఫ్యాన్స్ కు ఇక పండగే

“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !

హర్మన్‌ప్రీత్‌ను తప్పుబట్టిన అఫ్రిది..ట్రోలింగ్ చేస్తున్న ఇండియన్స్ !

Visitors Are Also Reading