Home » త్వరలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట్లో పెళ్లి సందడి….!

త్వరలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట్లో పెళ్లి సందడి….!

by Bunty
Ad

 

డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇతని పేరు తెలియనివారంటూ ఉండరు. హీరోలను మాస్ యాంగిల్ లో చూపిస్తూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. గత కొద్ది రోజులుగా తన ఖాతాలో ఎలాంటి హిట్ పడకపోయినప్పటికీ ఆయన సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇతను ఇండస్ట్రీలో ఓ స్పెషల్ మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. పూరి జగన్నాథ్ వ్యక్తిగత విషయానికి వస్తే…. ఇతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు అన్న విషయం అందరికీ తెలిసిందే. అబ్బాయి ఆకాష్, అమ్మాయి పవిత్ర.

Advertisement

వీరిద్దరు కూడా అతి చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆకాష్ ఈ మధ్యకాలంలో సినిమాలు కూడా చేస్తున్నారు. కానీ హీరోగా పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాడు. ఇక త్వరలోనే ఆకాష్ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆకాష్ తన చిన్ననాటి స్నేహితురాలితో కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నాడట. ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులకు చెప్పి వివాహానికి ఒప్పించాడట. ఇక త్వరలోనే వీరి ఎంగేజ్మెంట్, వివాహం జరగబోతుందని సమాచారం అందుతోంది.

అమ్మాయి ఒక పొలిటీషియన్ మనవరాలు అని తెలుస్తోంది. కానీ ఆమె ఎవరు…? ఏం చేస్తుంది…? అనే విషయాలు ఇంకా బయటికి రాలేదు. ఇక అతి కొద్దిరోజుల్లోనే వీరి ఎంగేజ్మెంట్ ని ఘనంగా నిర్వహించి అఫీషియల్ గా పెళ్లి డేట్ ని ప్రకటిస్తారట. ఇక పూరి జగన్నాథ్ తన కొడుకు ఎంగేజ్మెంట్ ని చాలా గ్రాండ్ గా జరిపించబోతున్నారట. వీరి ఎంగేజ్మెంట్ కి పలువురు సినీ ప్రముఖులందరూ తరలివస్తారని సమాచారం అందుతుంది. ఇక ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో, ఇండస్ట్రీవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading