Home » వయసు 16నెలలు..16 కోట్ల ఇంజెక్షన్ కావాలి…!

వయసు 16నెలలు..16 కోట్ల ఇంజెక్షన్ కావాలి…!

by AJAY
Ad

రియ‌ల్ హీరో సోనూసూద్ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. లాక్ డౌన్ వేళ సోనూసూద్ త‌న సేవాకార్య‌క్ర‌మాల‌తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. దేశ‌వ్యాప్తంగా సేవాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ రియ‌ల్ హీరో అనిపించుకున్నారు. అంతే ఆ త‌ర‌వాత విద్య‌,వైద్యం ఇలా అవ‌స‌రం ఏదైనా సోనూ సూద్ ముందుకు వ‌చ్చి వారికి అండ‌గా నిలుస్తున్నారు.

Advertisement

అలాంటి సోనూసూద్ ఇప్పుడు మ‌రోసారి ప్రాణాంత‌క వ్యాధితో బాధ‌ప‌డుతున్న 16 నెల‌ల బాబు కోసం రంగంలోకి దిగాడు. నాగ్ పూర్ కు చెందిన విహాన్ అనే 16 నెల‌ల బాలుడు అరుదైన న్యూరో సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు. విహాన్ తండ్రి విక్ర‌మ్ డాక్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ ఆయ‌న కూడా మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుండే వ‌చ్చాడు.

Advertisement

దాంతో త‌న కుమారుడికి 16 కోట్లం ఇంజెక్ష‌న్ వేయించ‌డం కోసం ఆ త‌ల్లి దండ్రులు త‌ల్ల‌డిల్లిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో దాత‌ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ న‌టులు అభిషేక్ బ‌చ్చ‌న్, మ‌నోజ్ బాజ్ పై లాంటి వాళ్లు త‌న వంతు సాయం చేశారు. బాలుడి ఇంజెక్ష‌న్ కోసం ఇంకా 12 ల‌క్ష‌లు జ‌మ కావాల్సి ఉంది. దాంతో సోనూ సూద్ ముందుకు వ‌చ్చి విరాళాలు సేక‌రిస్తున్న‌ట్టు చెప్పారు.

తాను బాబు కోసం సాయం చేస్తాన‌ని మీరు కూడా తోచినంత చారిటీకి దానం చేయాల‌ని కోరాడు. ఇంపాక్ట్ గురు, గో ఫండ్ అనే వెబ్ సైట్ ల ద్వారా విహాన్ కోసం విరాళాలు సేక‌రిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇంకా రెండు నెల‌లే స‌మ‌యం ఉండ‌టం తో బాలుడి త‌ల్లి తండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. ఇక ఇప్పుడు సోనూ సూద్ ముందుకు రావ‌డంతో నెటిజ‌న్లు ఆయ‌న పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Also read :

రాఘవేంద్ర రావు చేసిన ఆ పనికి చిరంజీవికి అన్ని తలనొప్పులు వచ్చాయో తెలుసా ?

నా భ‌ర్త‌తో ఎన్నో గొడ‌వ‌లు జ‌రిగాయి…విడాకుల పై సుమ షాకింగ్ కామెంట్లు..!

Visitors Are Also Reading