Telugu News » రాఘవేంద్ర రావు చేసిన ఆ పనికి చిరంజీవికి అన్ని తలనొప్పులు వచ్చాయో తెలుసా ?

రాఘవేంద్ర రావు చేసిన ఆ పనికి చిరంజీవికి అన్ని తలనొప్పులు వచ్చాయో తెలుసా ?

by AJAY MADDIBOINA

ప్ర‌స్తుతం ముద్దు సీన్లు, రొమాంటిక్ స‌న్నివేశాలు ఉండ‌ని సినిమాలు ఉండ‌వు. కానీ అప్ప‌ట్లో ముద్దంటే చేద‌నే విధంగా సినిమాలు క‌నిపించేవి. రొమాంటిక్ సీన్ల‌కు హీరోలు హీరోయిన్ లు దూరంగా ఉండేవారు. కొన్ని సినిమాల‌లో ముద్దు సీన్లు ఉన్నా అవి చెంప‌ల‌పైనా లేదంటే చేతుల పైన ఉండేవి. ఒక‌వేళ పెద‌వుల పై ముద్దు పెట్టే సీన్లు ఉన్న‌ట్ట‌యితే వాటిని ఓ పూల కొమ్మ‌లను అడ్డుగా ఊపుతూ చూపించేవారు. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు చేసిన కొన్ని సినిమాల్లో మాత్రం డోస్ పెంచిన రొమాంటిక్ స‌న్నివేశాలు క‌నించేవి.

Ads

 

రాఘవేంద్ర‌రావు సినిమాల‌లో బొడ్డు పై పండ్ల‌తో కొట్ట‌డం…పెదాల‌పై పువ్వులు విస‌ర‌డం..పై నుండి హీరోయిన్ ఒంటి పై నీళ్లు పోయ‌డం లాంటి రొమాంటిక్ సీన్లు క‌నిపించేవి. ఇదిలా ఉంటే అలాంటి స‌మ‌యంలో కూడా ఓ సినిమాలో రాఘ‌వేంద్ర‌రావు లిప్ లాక్ స‌న్నివేశాన్ని తెర‌కెక్కించారు. దాంతో అదో సంచ‌ల‌నం గా మారిపోయింది. ఆ లిప్ లాక్ స‌న్నివేశం కూడా స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనిది కావ‌డం మ‌రో సంచ‌ల‌నం. ఆ త‌ర‌వాత కానీ అంత‌కు ముందు కానీ చిరు లిప్ లాక్ ల జోలికి వెళ్ల‌లేదు. ఆ సినిమా ఏంటి..? ఆ లిప్ లాక్ వెన‌క క‌థ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం…..1990ల‌లో చిరు కెరీర్ పీక్స్ లో ఉండేది.

దేశంలోనే అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ పుచ్చుకునే హీరోగా కూడా చిరంజీవి మారిపోయారు. ఆయ‌న తో సినిమాలు చేయ‌డానికి ద‌ర్శ‌కులు నిర్మాత‌లు క్యూ క‌ట్టేవారు. అదే స‌మ‌యంలో కె రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో చాలా సినిమాలు వ‌చ్చాయి. వీరి కాంబోలో వ‌చ్చిన మొద‌టి సినిమా మోస‌గాడు…ఈ సినిమాలో శోభ‌న్ బాబు హీరోగా చిరు విల‌న్ గా న‌టించారు. ఇక రాఘ‌వేంద్ర‌రావు చిరు కాంబో లో వ‌చ్చిన రెండో సినిమా తిరుగులేని మ‌నిషి. ఈ సినిమాలో ఎన్టీఆర్ మెయిన్ హీరోగా న‌టించగా చిరు సెకండ్ హీరోగా న‌టించారు.

chiranjeevi

chiranjeevi nagma

ఇక చిరుతో రాఘ‌వేంద్ర‌రావు ఘ‌ర‌నామొగుడు సినిమా వ‌చ్చింది.ఈ సినిమాలో హీరోయిన్ గా న‌గ్మ హీరోయిన్ గా న‌టించింది. వాణి విశ్వ‌నాథ్ సెకండ్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాలో పండు పండు సాంగ్ లో న‌గ్మ చిరుల మ‌ధ్య లిప్ లాక్ సీన్ పెట్టాల‌ని నిర్న‌యం తీసుకున్నాడు. అప్ప‌ట్లో లిప్ లాక్ సీన్ అంటే సంచ‌ల‌న‌మే….చిరు మొద‌ట ఈ సీన్ కు నో చెప్పి ఆ త‌ర‌వాత చేసేది లేక ఒప్పేసుకున్నార‌ట‌. ఈ సీన్ చేసిన‌ప్ప‌టికీ చిరంజీవికి మ‌న‌సులో మాత్రం ఫ్యాన్స్ ఒప్పుకుంటారా లేదా అన్న ఆందోళ‌న ఉండేద‌ట‌. ఆ టెన్ష‌న్ భ‌రించ‌లే రాఘ‌వేంద్ర‌రావును ఒప్పించి సీన్ ను చివ‌రికి ఎడిటింగ్ లో క‌ట్ చేయించార‌ట‌.

ALSO READ :

ప్ర‌భాస్ “ఆదిపురుష్” పై కేటీఆర్ కామెంట్ల వెన‌క అస‌లు కార‌ణం అదేనా..?

కేజీఎఫ్- 2 న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న్స్…అంద‌రికంటే ఎక్కువ పుచ్చుకుంది ఎవ‌రో తెలుసా..!


You may also like