Home » 7G బృందావన కాలనీ.. హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

7G బృందావన కాలనీ.. హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

by Bunty
Ad

7/G బృందావన్ కాలనీ సినిమాలో హీరోయిన్గా నటించిన సోనియా అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సినిమా అప్పట్లో చాలా పాపులర్ అయింది. ఈ సినిమాకి యూత్ బాగా కనెక్ట్ అయిపోయారు. అయితే ఈ సినిమా అనంతరం సోనియా అగర్వాల్ పెద్దగా సినిమా అవకాశాలను అందుకోలేకపోయింది. అయితే ఈ అమ్మడుకి ఇప్పుడు హీరోయిన్ కి సరిపడా అందం, ఫిట్నెస్ ఉన్నప్పటికీ హీరోయిన్గా అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ముందుకు రాలేకపోతున్నారు.

Advertisement

సైడ్ క్యారెక్టర్లలో నటించడానికి అవకాశాలు ఇస్తున్నారు. కానీ అలాంటి పాత్రలలో నటించడానికి ఈ అమ్మడు ఒప్పుకోలేకపోతుంది. నేను కూడా త్రిష, నయనతార వంటి హీరోయిన్లు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడే నేను కూడా సినిమాల్లోకి వచ్చాను. వారు ఇప్పటికీ హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. మరి నన్ను ఎందుకు సైడ్ క్యారెక్టర్ లో నటించమని అడుగుతున్నారు అని మండిపడుతుందట ఈ అమ్మడు. దర్శకుడు సెల్వ రాఘవన్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహం అనంతరం సినిమాలకు పూర్తిగా దూరమైంది.

Advertisement

కానీ పెళ్లయిన కొన్ని రోజులకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ ఈ అమ్మడుని ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. తనని పూర్తిగా ప్రేక్షకులు మర్చిపోయారు. హీరోయిన్గా ఎవ్వరు అవకాశాలు ఇవ్వలేదు. కేవలం సైడ్ క్యారెక్టర్లలో మాత్రమే అవకాశాలు ఇచ్చారు. దీంతో తెలుగులో టెంపర్ సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ఇక తమిళంలో కూడా సైడ్ క్యారెక్టర్లలో నటిస్తోంది. ఇప్పట్లో తల్లి పాత్రలలో నటించనని కరాకండిగా చెప్పేస్తుందట సోనియా. ప్రస్తుతం సినిమాలలో హీరోయిన్గా అవకాశాల కోసం ఎదురు చూస్తుందట ఈ అమ్మడు.

ఇవి కూడా చదవండి

SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

బిచ్చగాళ్ళు మీకు ఎదురు వస్తున్నారా.. అయితే మీరు ఎంతో అదృష్టవంతులు..!

గ్రాండ్ గా SRH కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ పెళ్లి…ఫోటోలు వైరల్

Visitors Are Also Reading