Home » వామ్మో.. శోభన్ బాబు ఆస్తుల విలువ ఏకంగా రూ.లక్ష కోట్లా? ఆసక్తికరమైన విషయాలు రివీల్..!

వామ్మో.. శోభన్ బాబు ఆస్తుల విలువ ఏకంగా రూ.లక్ష కోట్లా? ఆసక్తికరమైన విషయాలు రివీల్..!

by Anji
Ad

సీనియర్ స్టార్ హీరోలలో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవల కృష్ణం రాజు, కృష్ణల మరణంతో ఈ హీరోలందరూ కనుమరుగైన విషయం తెలిసిందే. ఈ స్టార్ హీరోలలో ఒకరైన శోభన్ బాబు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల మనస్సులను గెలుచుకోవడంతో పాటు సోగ్గాడిగా ఇమేజ్ ని సంపాదించుకున్నారు. ప్రధానం శోభన్ బాబు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును భూములపై ఇన్వెస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ భూముల విలువ వేల కోట్ల రూపాయలుగా ఉంది.


ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. శోభన్ బాబు నాతో ప్రాపర్టీ విషయాలు చెప్పే వారని.. ఆయన కామెంట్లు చేశారు. ప్రధానంగా శోభన్ బాబుకి కోపం వస్తే ఆ కోపం తాటాకు మంటలాంటి కోపం అని వెల్లడించారు. షేర్స్ కూడా ఆయన ఇన్వెస్ట్ మెంట్ చేసేవారని రామారావు పేర్కొన్నారు. భూమి మాత్రం పెరగదని అందువల్ల భూమి వాల్యూ పెరుగుతుందని ముందే శోభన్ బాబు చెప్పేవారని ఇమంది రామారావు తెలిపారు. శోభన్ బాబు వందలాది ఎకరాలను కొనుగోలు చేసేవారని.. ఇమంది రామారావు పేర్కొన్నారు. శోభన్ బాబుకు రూ.80వేల కోట్ల ఆస్తి ఉంటుందని చెప్పుకొచ్చారు.

Advertisement

Advertisement

Also Read :  మహానటి సావిత్రికి పద్మ శ్రీ రాకుండా అడ్డుకున్నది ఎవరో తెలుసా?

శోభన్ బాబు భూమిని నమ్ముకున్న వాళ్లు ఎప్పటికీ చెడిపోరు అని భావించారు అని ఇమంది గుర్తు చేశారు. శోభన్ బాబు ఆయన ఫ్యామిలీని బయటికి చూపించేందుకు ఇష్టపడే వారు కాదని ఇమంది చెప్పేవారు. ప్రస్తుతం శోభన్ బాబు ఆస్తులు సుమారుగా లక్ష కోట్ల రూపాయలకు ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది. ఆదాయపు పన్ను శాఖ అధికారుల నుంచి సమస్యలు వస్తాయని భావించి ఆస్తుల గురించి చెప్పడానికీ శోభన్ బాబు వారసులు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. మరోవైపు శోభన్ బాబుకి వయస్సు పెరిగిన తరువాత సినిమాల్లో మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిని రిజెక్ట్ చేశారట. ఇప్పటికీ కూడా ఆయన ప్రేక్షకుల హృదయాల్లో జీవించే ఉన్నారు.

Also Read :   సింగర్ సునీత భ‌ర్త మీకు తెలుసా.. ?

Visitors Are Also Reading