Home » ఆ ఒక్క కారణం తో బాహుబలిని మిస్ చేసుకున్న “సీతారామం” హీరోయిన్…! ఆ కారణం ఏంటి..?

ఆ ఒక్క కారణం తో బాహుబలిని మిస్ చేసుకున్న “సీతారామం” హీరోయిన్…! ఆ కారణం ఏంటి..?

by AJAY
Ad

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్స్ లో ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ ముద్దుగుమ్మ అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. కెరీర్ ప్రారంభం లో మృణాల్ మరాఠీ చిత్రాలు సీరియల్స్ లో నటించి అలరించింది. ఆ తరవాత హిందీ లో కూడా సినిమాలు చేసింది. ఇటీవల షాహిద్ కపూర్ హీరో గా నటించిన జెర్సీ సినిమాలో కూడా హీరోయిన్ గా అలరించింది.

Advertisement

ఇదిలా ఉండగా ఇప్పుడు దుల్కర్ సల్మాన్ కు జోడిగా సీతా రామం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తోంది. అంతే కాకుండా సినిమా లో మృణాల్ నటన కూడా ఆకట్టుకోవడం తో ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

ఇదిలా ఉండగా నిజానికి మృణాల్ ఠాకూర్ ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలో నటించాల్సి ఉండగా ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది. ఆ సినిమా మరేదో కాదు బాహుబలి సినిమాలో నటించే ఛాన్స్ ను మృనాల్ మిస్ చేసుకుంది.

అయితే ఈ సినిమా లో హీరోయిన్ గా కాదు….సినిమాలో రమ్యకృష్ణ నటించిన శివగామి పాత్రలో నటించే ఛాన్స్ ను మృణాల్ మిస్ చేసుకుంది. జక్కన్న బాహుబలి సినిమా ఆడిషన్స్ కోసం ముంబై లో కూడా ఆడిషన్స్ నిర్వహించారట. ఆడిషన్స్ లో మృణాల్ ను ఎంపిక చేశారట. కానీ ఆ తరవాత ఏమైందో ఏమో గానీ రాజమౌళి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అలా ఫైనల్ గా శివగామి పాత్ర కోసం రమ్యకృష్ణ ను ఎంపిక చేశారు.

Visitors Are Also Reading