Home » కాంతారా సినిమాలోని వరాహ రూపం పాటతో ఫేమస్ అయిన సింగర్ శ్రీలలిత.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?

కాంతారా సినిమాలోని వరాహ రూపం పాటతో ఫేమస్ అయిన సింగర్ శ్రీలలిత.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?

by Anji
Ad

కన్నడ దర్శకుడు రిషబ్ షెట్టి హీరోగా నటించి స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రం కాంతారా. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా తొలుత కేవలం కన్నడంలో మాత్రమే విడుదలఅయింది. ఆ తరువాత కన్నడంతో పాటు హిందీ, తెలుగు, తమిళం, మలయాళ వంటి భాషల్లో విడుదలై దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ప్రధానంగా ఈ సినిమా అంతటి సంచలన విజయం సాధించడానికి ముఖ్య కారణం వరాహ రూపం పాట. ఈ మధ్యకాలంలో ఈ సినిమాలోని వరాహ రూపం పాట ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుందనే చెప్పాలి. 

Advertisement

ఇక ఇటీవల కాలంలో సినిమాలలోని ఒరిజినల్ సాంగ్స్ కి కవర్ సాంగ్స్ చేయడం సర్వసాధారణమే. కాంతారా సినిమాలోని వరాహ రూపం పాట కొత్త మ్యూజిక్ ఇన్స్ స్ట్రూమెంట్ తో రీ క్రియేట్ చేసి వార్తలలో నిలిచింది. దీంతో ఆ పాట విన్నవారందరూ సింగర్ ఎవరు అని వెతకడం ప్రారంభించారు. తెలుగు బుల్లితెరపై ఎన్నో సింగింగ్ కాంపిటేషన్స్ లలో తన ప్రతిభను చాటింది సింగర్ శ్రీలలిత. అసలు శ్రీలలిత గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈమె తల్లిదండ్రులు కూడా సంగీత నేపథ్యం ఉన్న వాళ్లే కావడం విశేషం. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఎంతో ఇష్టం ఉన్నటువంటి శ్రీలలితకు శిక్షణ ఇప్పించడమే కాకుండా ఈమె ఎన్నో సింగింగ్ కాంపిటేషన్ కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. బోల్ బేబీ బోల్, సూపర్ సింగర్, పాడుతా తీయగా, స్వరాభిషేకం, స్వర్ణనీరాజనం, సరిగమప లిటిల్ చాంప్స్ లాంటి ప్రోగ్రామ్స్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. లిటిల్ ఛాంప్ కదా అని అందరూ అనుకున్నారు.

Advertisement

Also Read :  Matti kusthi review: మట్టి కుస్తీ మూవీ రివ్యూ& రేటింగ్..!!

Manam News

ఇటీవల కాంతారా చిత్రంలోని పాపులర్ సాంగ్ అయినటువంటి వరాహ రూపం సాంగ్ ని ఒక్క కవర్ సాంగ్ చేసి ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. కజు అనే డిఫరెంట్ సంగీత వాయిద్యంతో పూర్తి పాటను రీ క్రియేట్ చేసి ట్రెండ్ సృష్టించింది. వరాహ రూపం పాటనే సినిమాకు సగం బలం.అలాంటి పాటను కేవలం కజు అనే మౌత్ ఇన్స్ట్రుమెంట్ తో సింగింగ్ చేయడం అద్భుతమనే చెప్పాలి. కాంతారా ఒరిజినల్ సాంగ్ మేల్ సింగర్ పాడారు. కానీ రీ క్రియేషన్ లో శ్రీలలిత అందరికీ కజు  ఇన్స్ట్రుమెంట్ ని పరిచయం చేస్తూ అద్భుతంగా పాడింది. ఈ పాటకు ఏకంగా 3 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. తాజాగా శ్రీలలిత ఈ పాట అనంతరం పలు ఇంటర్వ్యూలకు హాజరువుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. ఓ ఇంటర్వూలో వరాహ రూపం పాటను పర్మార్మ్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో తెగ వైరల్ అవుతోంది.  

Also Read :  “వదంది” రివ్యూ& రేటింగ్.. చివరి ట్విస్ట్ అదిరిపోలా..!!

Visitors Are Also Reading