Home » సింగ‌ర్ స్మిత పెళ్లితో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న రిలేష‌న్ ఏంటో తెలుసా..?

సింగ‌ర్ స్మిత పెళ్లితో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న రిలేష‌న్ ఏంటో తెలుసా..?

by AJAY
Published: Last Updated on
Ad

సింగ‌ర్ స్మిత పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అప్ప‌ట్లో స్మిత పాట‌ల ఆల్మ‌మ్ ల‌ను తెలుగు వారికి ప‌రిచ‌యం చేసి త‌నదైన గొంతు మరియు పాట‌ల‌తో అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో సూప‌ర్ హిట్ పాట‌లు పాటి అల‌రించింది. అంతే కాకుండా స్మిత సినిమాల‌లోనూ న‌టించింది. మ‌స‌క మ‌స‌క చీక‌టిలో అంటూ స్మిత అప్ప‌ట్లో పాడిన రీమేక్ పాట యూట్యూబ్ ను షేక్ చేసింది.

Also Read: మొన్న చంపేశారు…ఇప్పుడు గ‌ర్భ‌వ‌తిని చేశారు…వారిపై పున‌ర్న‌వి ఫైర్..!

Advertisement

 

అంతే కాకుండా ప‌లు పాప్ సాంగ్స్ పాడి త‌న‌దైన స‌త్తా చాటింది. ఇక చాలా కాలంగా స్మిత సినిమాల‌కు మ‌రియు సినిమాల్లో పాట‌ల‌కు దూరంగా ఉంటుంది. కానీ సింగింగ్ రియాలిటీ షోల తో పాటూ ఇత‌ర రియాలీటి షో ల‌లో మెరుస్తోంది. ఇదిలా ఉంటే స్మిత తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ తో పాటూ కెరీర్ కు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకుంది.

Advertisement

Also Read: 5 ఏళ్ల‌లోనే 5 ల‌గ్జ‌రీ అపార్ట్మెంట్స్…ర‌ష్మిక సంపాద‌న మామూలుగా లేదుగా..?

త‌న‌ది ల‌వ్ మ్యారేజ్ అనిచెప్పింది. అంతే కాకుండా త‌న విష‌యాల‌లో భ‌ర్త ఎప్పుడూ స‌పోర్ట్ గా ఉంటాడ‌ని చెప్పింది. అంతే కాకుండా త‌మ‌ది ల‌వ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ త‌ని త‌న ఫ్రెండ్ స‌ర్కిల్ లో అంద‌రూ త‌న భ‌ర్త‌ను భావ అని పిలుస్తార‌ని తాను కూడా అలానే పిలిచేదాన్న‌న‌ని చెప్పింది. పెళ్లినాటికి త‌న వ‌య‌సు 21 సంవ‌త్స‌రాల‌ని చెప్పింది. అంతే కాకుండా నాగార్జున సోద‌రుడు వెంక‌ట్ త‌న పెళ్లిని ద‌గ్గ‌రుండి జ‌రిపించార‌ని తెలిపింది. ఆయ‌న‌నే రెండు ఫ్యామిలీల‌తో మాట్లాడి సంబంధాన్ని ఒప్పించార‌ని చెప్పింది. ఇక త‌మ‌కు ప్ర‌స్తుతం ఒక పాప ఉంద‌ని పాప పేరు శివి అని తెలిపింది.

Also Read: చిరంజీవి సినిమాలో అవకాశం కోసం ఇంటికెళ్లి అడిగా.. గోపిచంద్ భార్య గురించి శ్రీకాంత్ ఏమన్నారంటే..?

Visitors Are Also Reading