Home » టాలీవుడ్ స్టార్ హీరో పేరును తన కొడుక్కి పెట్టిన సింగర్ గీతామాధురి..!

టాలీవుడ్ స్టార్ హీరో పేరును తన కొడుక్కి పెట్టిన సింగర్ గీతామాధురి..!

by Anji

సాధారణంగా  ఎవరైనా సరే తమకు పుట్టిన పిల్లలకు తమ తండ్రి తాత లేదా దేవుడి పేర్లు కలిసే విధంగా పెట్టుకుంటారు. మరి కొంత మంది కాస్త వెరైటీగా పేర్లు పెడతారు. ఇంకొంత మంది అయితే వారికి నచ్చిన సెలెబ్రెటీల పేర్లు పెడుతూ ఉంటారు. అయితే సింగర్ గీత మాధురి కూడా తన కొడుకుకి ఆ స్టార్ హీరో పేరు కలిసి వచ్చేలా పెట్టుకుంది. ఇక ప్రస్తుతం ఈ పేరు చూసి చాలామంది నెటిజన్స్ ఏంటి ఆ హీరో అంటే గీత మాధురికి అంత ఇష్టమా..? ఆ హీరో పేరుని తన కొడుక్కి పెట్టుకుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.  మరి ఇంతకీ గీతామాధురి కొడుకు పేరు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

టాలీవుడ్ లో సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గీత మాధురి నటుడు నందు ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక గీత మాధురి బిగ్ బాస్ 2 లో కూడా రన్నరప్ గా నిలిచింది. అలాగే గీత మాధురి భర్త నందు కూడా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే విలన్ గా కూడా చేస్తున్నారు.అయితే రీసెంట్గా సింగర్ గీత మాధురి నందు లు పేరెంట్స్ అయ్యారు.మొదట వీరికి ప్రకృతి  అనే పాప పుట్టింది. ఆ తర్వాత రీసెంట్ గా ఫిబ్రవరి 10న గీత మాధురికి పండంటి బాబు జన్మించాడు. తాజాగా ఆ బాబుకి నామకరణం చేసి బారసాల ఫంక్షన్ ని గ్రాండ్గా జరిపింది. ఈ బారసాల ఫంక్షన్ కి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, సన్నిహితులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా చాలామంది హాజరయ్యారు.

ప్రస్తుతం గీత మాధురి కొడుకు బారసాల ఫంక్షన్ కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్  అవుతున్నాయి. గీత మాధురి నందు తమకు పుట్టిన కొడుక్కి ‘ధ్రువధీర్ తారక్’ అని నామకరణం చేశారు.  ప్రస్తుతం గీత మాధురి కొడుకు పేరు బయట పెట్టడంతో చాలామంది నెటిజన్స్ ఏంటి గీత మాధురి జూనియర్ ఎన్టీఆర్ పేరు కలిసి వచ్చేలా తన కొడుకు పేరు పెట్టుకుంది. గీత మాధురికి ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే గీత మాధురి ఎన్టీఆర్ మీద ఇష్టంతోనే అలా పెట్టిందా లేక మరేదైనా కారణం ఉందా..?  అనేది  మాత్రం ఎవ్వరికీ తెలియదు.

Also Read :   స‌నాత‌న ధ‌ర్మంపై ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌ గురించి సుప్రీంకోర్టు ఏమందో తెలుసా ?

Visitors Are Also Reading