Telugu News » Blog » కోలీవుడ్ లో విడాకులు తీసుకున్న స్టార్ కపుల్స్ ఎవరో తెలుసా ? ‘జెమిని గణేశన్‌’ నుంచి ‘ధనుష్‌’ వరకు లిస్ట్ ..!

కోలీవుడ్ లో విడాకులు తీసుకున్న స్టార్ కపుల్స్ ఎవరో తెలుసా ? ‘జెమిని గణేశన్‌’ నుంచి ‘ధనుష్‌’ వరకు లిస్ట్ ..!

by Anji
Ads

కోలీవుడ్  మాంగ‌ల్య బంధం బీట‌లు వారుతున్న‌ది. ఎంతో మంది అభిమానుల‌కు స్పూర్తి, మార్గ‌ద‌ర్శ‌కంగా ఉండే స్టార్ సెల‌బ్రిటీలు త‌మ సంసార జీవితాల‌ను చిన్నాభిన్న చేసుకుంటున్నారు. త‌మ వైవాహిక జీవితంలో ఏర్ప‌డే చిన్న‌నాటి పొర‌పొచ్చాల‌ను పెద్ద‌వి చేసుకుని చివ‌రికి విడాకుల వ‌ర‌కు వెళ్తున్నారు. అల‌నాటి మేటి త‌మిళ న‌టుడు కాద‌ల్‌మ‌న్న‌న్ , జెమినిగ‌ణేష‌న్ నుంచి నేటి యువ న‌టుడు ధ‌నుష్ వ‌ర‌కు పొస‌గ‌ని దాంప‌త్యంతో భార్య‌ల‌కు విడాకులు ఇచ్చిన వారిలో ఎంద‌రో ఉన్నారు. అనాటి కాలంలో జెమిని గ‌ణేశ‌న్ కాద‌ల్ మ‌న్న‌న్ అనే పేరుకు త‌గ్గ‌ట్టే న‌లుగురు భార్య‌ల‌తో కాపురం చేసారు.

Advertisement

ఆ న‌లుగురిలో మ‌హాన‌టి సావిత్రి కూడా ఉండడం విశేషం. 1997లో వృద్ధాప్యంలో జూలియానా ఆండ్రియా అనే విదేశీ యువ‌తితో వివాహ సంబంధం ఏర్ప‌ర‌చుకున్న ఘ‌ట‌న ఆయ‌న‌కే ద‌క్కింది. ఆయ‌న‌తో పాటు బాల‌న‌టుడిగా చిత్ర‌సీమ‌లో ప్ర‌వేశించిన విశ్వ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ సారిక దంప‌తులు మొద‌లుకుని ఇప్పుడు ధ‌నుష్-ఐశ్వ‌ర్య దంప‌తుల వ‌ర‌కు వ‌చ్చింది. త‌మిళ చిత్ర‌సీమ‌లో ఇప్ప‌టివ‌ర‌కు విడాకులు తీసుకున్న సెల‌బ్రిటీల జంట‌ల వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే..

జెమిని గణేశన్‌ నుంచి ధనుష్‌ వరకు.. కోలీవుడ్‌లో పెరుగుతున్న విడాకుల సంస్కృతి

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ త‌న మొద‌టి భార్య వాణి, రెండు భార్య సారికల‌కు విడాకులు ఇచ్చారు. ఆ త‌రువాత న‌టి గౌత‌మితో స‌హ‌జీవ‌నం చేసారు. ఆ త‌రువాత ఆమెకు కూడా దూరం అయ్యారు. ద‌ర్శ‌క‌న‌టుడు, హీరో పార్టీబ‌న్ న‌టి సీత‌ను పెళ్లి చేసుకున్నారు. పుదియ‌పాదై అనే చిత్ర షూటింగ్ స‌మయంలోప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1990-2001 వ‌ర‌కు భార్యభ‌ర్త‌లుగా జీవించారు. వీరికి ముగ్గురు పిల్ల‌లున్నారు. ఆ త‌రువాత ఈ జంట విడిపోయింది.

Ramarajan and Nalini's daughter reveals surprising details for the first time - Tamil News - IndiaGlitz.com

1980 ద‌శ‌కంలో అగ్ర‌హీరోలు ర‌జ‌నికాంత్, క‌మ‌ల్‌హాస‌న్‌కు పోటీగా గ్రామీణ సూప‌ర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన హీరో రామ‌రాజ‌న్‌. న‌టి న‌ళినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1987 నుంచి 2000 వ‌ర‌కు క‌లిసిమెలిసి ఉన్నారు. ఆ త‌రువాత విడాకులు తీసుకున్నారు. వీరికి అరుణ్, అరుణ అనే ఇద్ద‌రు పిల్ల‌లున్నారు.

Kamal Hassan opens up on his breakup with his long-time partner Gautami - IBTimes India

న‌టి గౌత‌మి 1999లో సందీప్ అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకుని విడిపోయారు. ఆ త‌రువాత 2004 -2016 వ‌ర‌కు హీరో క‌మ‌ల్‌హాస‌న్‌తో క‌లిసి స‌హ‌జీవ‌నం చేసారు. కొంత కాలానికి వీరిద్ద‌రూ విడిపోయారు.

Take A Look At These Beautiful Pics Of Tollywood Villains With Their Wives - Wirally

త‌మిళం, తెలుగు భాష‌ల్లో విలక్ష‌ణ న‌టుడిగా గుర్తింపు పొందిన ర‌ఘువ‌ర‌న్ న‌టి రోహిణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1996-2004 వ‌ర‌కు దాంప‌త్య జీవితం కొన‌సాగించిన వీరిద్ద‌రూ ఆ త‌రువాత విడిపోయారు.

నా భార్యకు ముందే పెళ్లైంది.. ఆ రాత్రి గుండె పగిలింది.. నరకం నుంచి .. హీరో ప్రశాంత్ | Actor Prashanth got divorce from his wife Grahalakshmi - Telugu Filmibeat

Advertisement

హీరో ప్ర‌శాంత్ త‌న భార్య గృహ‌ల‌క్ష్మికి విడాకులు ఇచ్చారు. ఆమెకు అప్పటికే పెళ్లి జ‌రిగింద‌ని.. ఆ విష‌యాన్ని దాచిపెట్టి త‌న‌ను పెళ్లి చేసుకున్నార‌నే కార‌ణ‌తో విడాకులిచ్చారు. వీరిద్ద‌రూ 2005-2009 వ‌ర‌కు నాలుగేళ్ల పాటు దంప‌తులుగా ఉన్నారు.

Revathi's Bitter Love Story: Married Actor, Suresh Chandra Menon, Became A Mother After Her Divorce

1980లో టాప్ హీరోయిన్‌గా ఉంది న‌టి రేవ‌తి. ప్ర‌ముఖ కెమెరామెన్‌, న‌టుడు సురేష్ మేన‌న్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 14 ఏండ్లు క‌లిసి ఉన్న‌ప్ప‌టికీ విడాకుల కోసం 2000 సంవత్స‌రంలో కోర్టును ఆశ్ర‌యించారు. 2013లో 13 ఏళ్ల త‌రువాత ఈ దంప‌తుల‌కు కోర్టు విడాకులు మంజూరు చేసింది.

ద‌ర్శ‌కుడు సెల్వ‌రాఘ‌వ‌న్ హీరోయిన్ సోనియా అగ‌ర్వాల్‌ను 2006లో ప్రేమించి పెళ్లి చేసుకుని నాలుగేళ్ల‌కే విడిపోయారు. ఆ త‌రువాత అసిస్టెంట్ ద‌ర్శ‌కురాలు గీతాంజ‌లిని సెల్వ‌రాఘ‌వ‌న్ రెండో పెళ్లి చేసుకోగా.. సోనియా అగ‌ర్వాల్ మాత్రం ఒంట‌రిగానే ఉంటున్న‌ది.

ఇండియన్ మేఖైల్ జాక్స‌న్‌గా న‌టుడుగా, హీరోగా ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందిన ప్ర‌భుదేవా కూడా తొలుత ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈయ‌న ర‌మ‌ల‌త‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. 1995-2011 వ‌ర‌కు క‌లిసి ఉన్న ఈ జంట 2011లో విడాకులు తీసుకున్నారు.

సీనియ‌ర్ హీరో శ‌ర‌త్‌కుమార్ తొలుత ఛాయ అనే మ‌హిళ‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ త‌రువాత ఆమెకు విడాకులు ఇచ్చి ఇప్పుడు సీనియ‌ర్ న‌టి రాధిక‌ను పెళ్లి చేసుకున్నారు. న‌టి రాధిక కూడా తొలుత న‌టుడు, ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ పోత‌న్ ను పెళ్లి చేసుకున్నారు. అత‌నికి విడాకులు ఇచ్చి రిచ‌ర్డ్ అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకుని విడిపోయారు. మూడ‌వ‌సారి న‌టుడు శ‌ర‌త్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

జెమిని గణేశన్‌ నుంచి ధనుష్‌ వరకు.. కోలీవుడ్‌లో పెరుగుతున్న విడాకుల సంస్కృతి

అదేవిధంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సంగీత ద‌ర్శ‌కుడు యువ‌న్ శంక‌ర్ రాజా, ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శిన్, న‌టి లిజి ప్రియ‌ద‌ర్శ‌న్ న‌టుడు అర‌వింద్ స్వామి న‌టి గాయ‌త్రి రామ‌మూర్తి న‌టుడు, ప్ర‌కాశ్‌రాజ్, న‌టీమ‌ణులు స‌రిత‌, ఊర్వ‌శి, శ్రీ‌విద్య‌, వనితా, విజ‌య‌కుమార్‌, వివాహ బంధం కూడా విడాకుల‌తోనే ముగిసింది.

జెమిని గణేశన్‌ నుంచి ధనుష్‌ వరకు.. కోలీవుడ్‌లో పెరుగుతున్న 'విడాకుల' సంస్కృతి

ఇప్పుడు హీరో ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ వివాహ బంధం ఇదేవిదంగా ముగియ‌నుండ‌టాన్ని ప్ర‌తి ఒక్క‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. వ‌య‌స్సులో త‌న‌కంటే రెండేల్లు పెద్ద అయిన త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్య‌ను హీరో ధ‌నుష్ ప్రేమించి పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 2004 న‌వంబ‌ర్ నెల 18న అంగ‌రంగం వైభ‌వంగా జ‌రిగింది. వీరి 18 ఏళ్ల దాంప‌త్య జీవితానికి గుర్తుగా యాత్ర‌, లింగా అనే ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. ఇటీవ‌లే ఈ జంట విడుపోతున్నట్టు ప్ర‌క‌టించారు.

Advertisement

Also Read: దేవి పుత్రుడు చిన్నారి ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా…! ఏం చేస్తుందంటే..!