Home » సరిపడా నీళ్లు తాగట్లేదని ఎలా తీసుకోవచ్చు..?

సరిపడా నీళ్లు తాగట్లేదని ఎలా తీసుకోవచ్చు..?

by Sravya

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో నీళ్లు కూడా అంతే ముఖ్యం. శరీరానికి సరిపడా నీళ్లు తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్య నిపుణులు కూడా ఈ విషయాన్ని చాలా సార్లు చెప్తూ ఉంటారు. సరిపడా నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ సమస్యని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీళ్లు తక్కువ తీసుకుంటున్నట్లయితే దాహం, నోరు పొడి వారి పోవడం, మూత్రం ముదురుగా రావడం వంటి లక్షణాలు కనబడతాయి. డిహైడ్రేషన్ తీవ్రంగా ఉంటే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది.

మూర్ఛ వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి డిహైడ్రేషన్ వలన ఫోకస్ బాగా తగ్గిపోతుంది. ఫోకస్ బాగా తగ్గుతున్నట్లయితే కచ్చితంగా నీళ్లు బాగా తీసుకోవాలి. మెదడు పనితీరుని నీళ్లు ప్రభావితం చేస్తాయి. ఏకాగ్రతని దెబ్బతీస్తాయి కాబట్టి నీళ్లు సరిగా తీసుకుంటూ ఉండాలి త్వరగా అలసిపోతున్నట్లయితే కూడా సరిపడా నీళ్లు తీసుకోవట్లేదని అర్థం. కాబట్టి అలసట ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువ నీళ్లు తీసుకుంటూ ఉండండి జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. మలబద్ధకం, అజీర్తి జీర్ణ సంబంధిత సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లయితే కచ్చితంగా నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.

ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading