సినిమా ఇండస్ట్రీలో రాణించడం చాలా ఈజీ అని అందరూ అనుకుంటారు. వారికి ఏంటి అనుకున్నవి అన్ని దగ్గరకు వస్తాయి ఎంజాయ్ చేస్తారని భావిస్తూ ఉంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలో రాణించడం ఆశ మాషి పని కాదు. ఎల్లప్పుడూ కత్తి మీద సాము లాంటిదే.. ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. జనాలు ఏం ఆలోచిస్తున్నారో , ఏ ట్రెండు నడుస్తుందో దానికి తగ్గట్టుగా నటీనటులు లేకుంటే ఇండస్ట్రీలో వారి పని అవుట్. అలా ఈ పదిమంది నటులు ముందుగా సైడ్ యాక్టర్స్ గా కెరియర్ మొదలుపెట్టి తర్వాత స్టార్ నటులుగా మారారు .. మరి వారెవరో మనం ఓ లుక్కేద్దాం..
విజయ్ దేవరకొండ:
Advertisement
అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. కానీ విజయ్ దేవరకొండ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా నటించాడు.
సాయి పల్లవి :
ఫిదా సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ బ్యూటీ. అంతేకాకుండా మలయాళం సినిమా ప్రేమమ్ తో అప్పటికే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. అలాంటి సాయి పల్లవి విశాల్, మీరాజాస్మిన్ నటించిన పందెంకోడి సినిమాలో మీరాకు స్నేహితురాలిగా నటించింది.
also read:సినిమాలో రవితేజకి ప్రేయసిగా, వదినగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా ?
త్రిష:
వర్షం మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన త్రిష. వర్షం కంటే ముందు జోడి సినిమాలో సిమ్రాన్ స్నేహితురాలుగా నటించింది.
రవితేజ:
స్టార్ హీరో రవితేజ ఇండస్ట్రీకి డైరెక్టర్ అవుదామని వచ్చారట. అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూనే చిన్న చిన్న పాత్రలు పోషించాడు. అల్లరి ప్రియుడు సినిమాలో రాజశేఖర్ ఫ్రెండ్స్ లో ఒకరిగా రవితేజను చూడొచ్చు. అంతేకాకుండా బ్రహ్మాజీ హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన సింధూరం సినిమాలో కూడా సెకండ్ హీరోగా చేశాడు.
Advertisement
కాజల్:
లక్ష్మీ కళ్యాణం మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కాజల్. హిందీ సినిమా క్యూ హు గయానాలో ఐశ్వర్యరాయ్ కి స్నేహితురాలుగా నటించింది.
రీతు వర్మ :
పెళ్లిచూపులు ఫేమ్ రీతు వర్మ ntr హీరోగా శ్రీనువైట్ల డైరెక్షన్లో వచ్చిన బాదుషా సినిమాలో కాజల్ చెల్లిగా నటించింది.
విజయ్ సేతుపతి:
తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా పరిచయం . పిజ్జా, నేను రౌడీ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా కొనసాగుతున్న విజయ్ సేతుపతి ఒకప్పుడు ధనుష్, కార్తీ, జయం రవి ఇలా వీళ్ళందరూ హీరోలుగా చేసిన సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ లో నటించాడు.
నవీన్ పోలిశెట్టి :
హీరో నవీన్ పొలిశెట్టి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో విజయ్ దేవరకొండ, నవీన్ ఇద్దరు స్నేహితులుగా నటించారు. అంతేకాకుండా సుశాంత్ సింగ్ రాజ్పుత్ సినిమాలో కూడా నటించాడు.
సత్యదేవ్ :
2011 లో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో చిన్న పాత్రలో చేశాడు సత్యదేవ్. అలా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకుంటున్నాడు.
అనసూయ:
ఇండస్ట్రీలో రంగమ్మత్తగా పేరు తెచ్చుకున్న అనసూయ. ఎన్టీఆర్ నాగ సినిమాలో స్టూడెంట్ గా నటించింది.
also read: