Home » విజ‌య్ ర‌ష్మిక‌లు న్యూయ‌ర్ వెకేష‌న్ కు చెక్కేశారా.? నెట్టింట వైర‌ల్ అవుతున్న ఫోటోలు..!

విజ‌య్ ర‌ష్మిక‌లు న్యూయ‌ర్ వెకేష‌న్ కు చెక్కేశారా.? నెట్టింట వైర‌ల్ అవుతున్న ఫోటోలు..!

by AJAY
Ad

సీనీఇండ‌స్ట్రీలో ప్రేమ‌ప‌క్షులు ఎన్నో..అయితే కొంత‌మంది ఓపెన్ గా చెప్పేస్తే మరికొంద‌రు మాత్రం సీక్రెట్ గా మెయింటెన్ చేస్తుంటారు. ప్ర‌స్తుతం అలాంటి వార్త‌నే ఒక‌టి నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌ష్మిక హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప్రేమ‌లో పడింద‌ని టాలీవుడ్ లో చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ర‌ష్మిక త‌న మాజీ ప్రియుడు ర‌క్ష్మిత్ శెట్టికి విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప్రేమ‌లో ప‌డ‌టం వ‌ల్ల‌నే హ్యాండ్ ఇచ్చిందనే టాక్ కూడా ఉంది.

Advertisement

ర‌ష్మిక విజ‌య్ దేవ‌ర‌కొండ క‌లిసి గీతాగోవిందం సినిమాలో న‌టించారు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఈ సినిమా త‌రవాత ర‌ష్మిక కు ఆఫ‌ర్ లు క్యూ క‌ట్టాయి. ఈ సినిమా విజ‌యం త‌ర‌వాత ఇద్ద‌రూ క‌లిసి డియ‌ర్ కామ్రేడ్ సినిమాలో మ‌రోసారి జ‌త‌క‌ట్టారు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రి మ‌ధ్య బంధం గ‌ట్టిపడిందంటూ వార్త‌లు గుప్పుమ‌న్నాయి. అంతే కాకుండా ర‌ష్మిక రౌడీ ఇంటికి వెళ్లి మ‌రీ ఓ ఫోటో దిగి షేర్ చేసింది.

Advertisement

మ‌రోవైపు గ‌తేడాది ర‌ష్మిక మ‌రియు విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రియు ఆనంద్ దేవ‌ర‌కొండ గోవాలో పార్టీ చేసుకున్న‌ట్టు కూడా టాక్ వినిపించింది. ఇద్ద‌రూ షేర్ చేసిన ఫోటోల‌లో బ్యాగ్రౌండ్ కూడా ఒక్క‌టే ఉండ‌టంతో ఆ వార్త‌ల‌కు బ‌లం చేకూరింది. ఇదిలా ఉంటే తాజాగా ఇంట‌ర్నెట్ లో ఇద్ద‌రి ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

vijay dewarakonda

vijay dewarakonda

న్యూయ‌ర్ సంధ‌ర్బంగా విజ‌య్ దేవ‌రకొండ చేతిలో వైన్ బాటిల్ తో ఓ ఫోటోను షేర్ చేసి న్యూయ‌ర్ విషెస్ చెప్పాడు. ఇక ర‌ష్మిక అదే లోకేష‌న్ లో దిగిన ఫోటోను అక్టొబ‌ర్ 9న షేర్ చేసింది. మ‌రోవైపు తాజాగా ర‌ష్మిక కూడా బీచ్ లో ఓ ఫోటోను షేర్ చేసింది. దాంతో ఇద్ద‌రూ క‌లిసే వెకేష‌న్ కు వెళ్లారా అంటూ నెటిజ‌న్ లు కామెంట్ లు చేస్తున్నారు.

Visitors Are Also Reading