Home » జయసుధ చెల్లెలు కూతురు హీరోయిన్ అని మీకు తెలుసా..?

జయసుధ చెల్లెలు కూతురు హీరోయిన్ అని మీకు తెలుసా..?

by Sravya
Ad

స్టార్ హీరోయిన్ జయసుధ అందరికి సుపరిచితమే. తెలుగుతో పాటుగా మలయాళం, హిందీ, కన్నడ, తమిళ్ భాషల్లో కూడా ఈమె నటించి అందర్నీ ఆకట్టుకున్నారు. మొదట హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన జయసుధ ఆ తర్వాత అమ్మ పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలలో నటిస్తున్నారు. మొన్నామధ్య విడుదలైన మళ్లీ పెళ్లి సినిమాలో కూడా కనపడ్డారు జయసుధ. అయితే జయసుధ గొప్ప నటి అని మనకి తెలుసు. అలానే ఆమె టాప్ హీరోల సరసన కూడా నటించారు.

Advertisement

కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే జయసుధ చెల్లెలు కూడా నటే. కానీ ఆమె తన అక్క లాగ గుర్తింపును మాత్రం పొందలేకపోయారు. జయసుధ వెండితెరపై దాదాపు 50 ఏళ్లు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటిదాకా జయసుధ 300 కి పైగా సినిమాల్లో నటించి అందరినీ ఆకట్టుకున్నారు. జయ సుధ చెల్లెలి విషయానికి వస్తే ఆమె పేరు సుభాషిని. బుల్లితెరపై నాగస్త్రం సీరియల్ లో కనపడి ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు. తర్వాత సుందరాకాండ సినిమాలో నటించారు.

Advertisement

అరుంధతి సినిమాలో సోనూసూద్ తల్లిగా నటించి ఆకట్టుకున్నారు. వెండి తెరపై సుభాషినికి జయసుధ అంత గుర్తింపు రాలేదు 12 సినిమాలు మాత్రమే చేశారు. సుభాషిని కూతురు ఒకప్పుడు హీరోయిన్. ఒకే ఒక సినిమాలో చేసింది. ఆమె పేరు ప్రియాంక. పూరి జగన్నాథ్ తమ్ముడు రామ్ శంకర్ హీరోగా వచ్చిన 143 సినిమాలో ఈమె సెకండ్ హీరోయిన్ గా కనపడింది. అయితే ప్రియాంక కి కూడా అంతగా గుర్తింపు రాలేదు దీంతో సినిమాలు చేయడం మానేసింది. 2012లో ఈమె పెళ్లి చేసుకుంది ప్రస్తుతం ఫ్యామిలీ తో బిజీ అయింది ప్రియాంక.

Also read:

తెలంగాణలో కాంగ్రెస్ వేవ్.. ఖమ్మం సభపై భారీ అంచనాలు

World Cup 2023: ఆతిధ్యం ఇస్తున్నా.. భారత్ ఎందుకు ఓపెనింగ్ మ్యాచ్ ఆడట్లేదు? అసలు కారణం ఇదే!

Yogibabu : కమెడియన్ యోగిబాబు గుర్తున్నారా? ఈయన ఒక్కరోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలిస్తే మైండ్ బ్లాక్..!

Visitors Are Also Reading