నటుడు సిద్ధార్థ్ అతిధి రావ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు సిద్ధార్థ్ అతిధి రావ్ హైదరి పెళ్లి గురించి అనుకున్నట్లు వివాహ బంధం లోకి వీళ్ళు అడుగుపెట్టారు. ఎట్టకేలకి పెళ్లి చేసుకున్నారు రహస్యంగా పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అందరూ వీళ్ళ ఏజ్ గ్యాప్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. తెలంగాణ లోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ లో రంగనాథ స్వామి ఆలయం మండపంలో కొంత మంది సన్నిహితులు కుటుంబ సభ్యులు సమక్షంలో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు.
హిందూ సంప్రదాయం ప్రకారం మూడు ముళ్ళు బంధంతో ఈ జంట ఒకటయ్యారు. వీరిద్దరూ కూడా తమ పెళ్లి వార్త గురించి స్పందించలేదు. తమిళనాడు కి చెందిన పురోహితులు వీళ్లిద్దరు పెళ్లిని హిందూ సంప్రదాయం ప్రకారం జరిపించినట్లు తెలుస్తోంది. వీళ్ళిద్దరికీ సంబంధించిన పెళ్లి ఫొటోస్ బయటకి రాలేదు.
Advertisement
Advertisement
Also read:
- Border Gavaskar Trophy: బోర్డర్ గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది..!
- Mohan Babu : సినిమాల్లోకి వెళ్తాను అని చెప్పగానే.. మోహన్ బాబు వాళ్ల నాన్న ఏం అన్నారో తెలుసా…?
- Akkineni Nageswara Rao: నాగేశ్వర రావు కి ఆ నటుడు డాన్స్ అంటే చాలా ఇష్టమట..!
ప్రస్తుతం వీళ్ళ పెళ్లి వార్తలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి దీంతో అందరూ వీళ్ళ గురించి ఆరా తీస్తున్నారు. అతిధి రావు కంటే హీరో సిద్ధార్థ్ దాదాపు ఏడేళ్లు పెద్దవాడు. అతిథి రావు 1986లో అక్టోబర్ 28న హైదరాబాద్లో పుట్టారు. సిద్ధార్ద్ 1979 ఫిబ్రవరి 17న చెన్నైలో పుట్టారు వీళ్ళ మధ్య ఏడేళ్లు ఏజ్ గ్యాప్ ఉంది. గతం లో వీళ్ళిద్దరికీ కూడా విడివిడిగా వివాహాలు అయ్యాయి విడాకులు కూడా తీసుకున్నారు ఇప్పుడు ఇద్దరూ కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!