శ్రియను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగులో పలు సినిమాల్లో నటించి ఆమె ప్రేక్షకులకు దగ్గర అయింది. సినిమా అవకాశాలు రావడం లేదనుకుందో.. లేక చేసిన సినిమాలు చాలనుకుందో తెలియదు కానీ అనూహ్యంగా ప్రేమ వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. కొవిడ్ సమయంలో బిడ్డను కూడా కనేసి ఆమె ఆ విషయం ఎవ్వరికీ చెప్పకుండా బిడ్డతో కలిసి ఫోటో వదిలి మరొకసారి షాక్ ఇచ్చింది. కానీ బేబీ బంప్‌తో ఉన్న వీడియో ఒకటి వదిలింది.
Advertisement
ఇక వివరాల్లోకి వెళ్లితే.. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో పుట్టి పెరిగిన శ్రియ అసలు పేరు శ్రియ శరణ్ భట్నాగర్. చిన్నప్పటి నుంచి ఆమె డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకుంది. రాజస్థాన్ ఫోక్ డాన్స్, కథక్ నేర్చుకున్న తరువాత ఆమె ఎన్నో డాన్స్ కాంపిటీషన్స్‌లో పాల్గొని మంచి పేరు సంపాదించింది. ఓ మ్యూజిక్ వీడియోలో కనిపించిన ఆమె ఆ మ్యూజిక్ వీడియో ద్వారా రామోజీ ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కించిన ఇష్టం సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది శ్రియ. దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రియ హీరోయిన్ గా నటించింది. ముఖ్యంగా శ్రియకు సంతోషం సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. అందులో శ్రియ సెకండ్ హీరోయిన్ రోల్ పోషించినా ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
ఇక ఆ తరువాత బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి, తరుణ్ తో నువ్వే నువ్వే, చిరంజీవితో ఠాగూర్ వంటి హిట్ చిత్రాల్లో నటించి చాలా రోజులు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొనసాగింది. అవకాశాలు తగ్గినా వెంటనే రష్యన్ టెన్నిస్ ప్లేయర్ ఆండ్రి కొశ్చిన్తో ప్రేమలో పడింది. ఆ ప్రేమ పెళ్లిపీటలెక్కింది. ఇక కరోనా సమయంలో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అక్టోబర్ 11న తొమ్మిది నెలల క్రితం తనకు ఆడపిల్ల పుట్టిందని.. తన కూతురు పేరు రాధ అని చెప్పింది. శ్రియ 2020 బ్యాక్ అంటూ బేబీ బంప్‌తో డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఇది చూసి అంతా షాకయ్యారు. ఆమె మళ్లీ గర్భవతి అయిందా ఏమిటి..? అని అనుమానపడిన తరువాత ఇది పాత వీడియో అని గుర్తించారు. ఆమె పాత వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ తరువాత మ్యూజిక్ స్కూల్ అనే సినిమా షూటింగ్లో ఆమె బిజీగా ఉంది.
Also Read :
Chanakya Niti : జీవితంలో చెడు సమయాలు రాకుండా ఏమి చేయాలంటే..?
భార్యను ప్రెగ్నెన్సీ చేయడానికి నిందితునికి 15 రోజుల పెరోల్ ఇచ్చిన హైకోర్టు..!