2010లో మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఖలేజా. ఈ చిత్రంలో మహేష్ బాబుకు జంటగా అనుష్క నటించారు. ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన ఖలేజా చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్ ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్న కూడా ఈ మూవీ రిలీజ్ సమయంలో నెగిటివ్ టాక్ ని మూటకట్టుకుంది. అదే కాకుండా ఈ సినిమా టైటిల్ కూడా రిలీజ్ కు ముందు వివాదాల్లో చిక్కుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
మహేష్ చిత్రా బృందం కంటే ముందే ఖలేజా టైటిల్ను ఓ వ్యక్తి నిర్మాతల మండలిలోముందే రిజిస్టర్ చేసుకున్నారు. ఇక ఎప్పుడైతే మహేష్ చిత్ర బంధం ఖలేజా టైటిల్ని అనౌన్స్ చేసిందో ఈ టైటిల్ని నేను ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నానని సదరు వ్యక్తి తన వద్ద ఉన్న ఆధారాలను సహా న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ సినిమా విడుదల కాకుండా తనకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని న్యాయమూర్తిని ఆ వ్యక్తి కోరారు. న్యాయమూర్తి అన్ని డాక్యుమెంట్స్ ని పరిశీలించి ఖలేజా టైటిల్ను రిజిస్టర్ చేసుకున్న వ్యక్తికి ఒక సూచన చేశారట.
మహేష్ చిత్ర బృందం వారు అప్పటికే షూటింగ్ ప్రచార కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. సినిమా విడుదలకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఈ సమయంలో సినిమా విడుదలకాకుండా ఆపమంటూ ఉత్తర్వులు జారీ చేయటం అంత సమంజసం కాదు. వారి నుంచి నష్టపరిహారం కోరడం ద్వారా మీకు న్యాయం జరగవచ్చు అంటూ న్యాయమూర్తి సదరు వ్యక్తితో వెల్లడించాడట. మీరు ఎంత కోరుకుంటున్నారో చెప్పండి అని అడిగి తుది తీర్పును భోజన విరామం తర్వాత ప్రకటిస్తానని న్యాయమూర్తి చెప్పారట.
Advertisement
దీంతో ఆ వ్యక్తి కోర్టు బయట మహేష్ బాబు చిత్ర బృందాన్ని రూ.10లక్షలు పరిహారంగా అడగడం జరిగిందట. మహేష్ ఖలేజా చిత్రానికి సంబంధించి నిర్మాతలు కూడా ఆ వ్యక్తి కోరిన 10 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ అతను దురాశతో తక్కువ మొత్తం అడిగి తప్పు చేశానేమో అని భావించిన ఆ వ్యక్తి కోర్టులో మాత్రం ఏకంగా 25 లక్షల పరిహారం కావాలని న్యాయమూర్తికి చెప్పడం జరిగింది. మొదట ఆ వ్యక్తి మమ్మల్ని బయట పది లక్షలు అడిగాడు. కోర్టులో 25 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని మహేష్ ఖలేజా టీం ఆధారాలతో సహా న్యాయమూర్తికి సమర్పించడం జరిగింది.
మొదట రూ.10లక్షలు తీసుకునేందుకు అంగీకరించి ఆ తర్వాత మాట మార్చిన విషయం న్యాయమూర్తికి తెలియడంతో.. ఆయన స్పందిస్తూ ఇప్పుడే ఈ కేసుపై పూర్తి విచారణ చేపట్టలేం… అలాగని తుది నిర్ణయమూ తీసుకోలేం. ఈ కేసుపై మరికొన్ని ఆధారాలను పరిశీలించాల్సి ఉంది. అప్పటివరకూ సినిమా ఆగకుండా కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వలేము. ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలతో మళ్లీ రావలసిందిగా మనవి చేస్తూ మీ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నా అంటూ న్యాయమూర్తి తీర్పు ప్రకటించడంతో ఖలేజా టైటిల్ను రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇక మహేష్ ఖలేజా చిత్ర యూనిట్ సైతం సినిమాకు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా మహేశ్ ఖలేజా అంటూ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ కేసును వాదించిన న్యాయవాది ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఈ ఫోటోలో నాగార్జున వెనుక ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా..?
Baby Movie Review : బేబీ సినిమా రివ్యూ..రౌడీ హీరో తమ్ముడు హిట్టు కొట్టాడా ?
Sadha: సదా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా..ఆ సమస్యలు ఉన్నాయా ?