Home » ఈ ఫోటోలో నాగార్జున వెనుక ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా..?

ఈ ఫోటోలో నాగార్జున వెనుక ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా..?

by Mounika
Ad

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన శివ చిత్రం అప్పటిలో ఎంతటి సెన్సేషన్ హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రంతో నాగార్జున హీరో నుంచి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. . ఇందులో నాగార్జున మాస్ యాక్షన్ తో యువతను ఫిదా చేసేసాడు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు ఆర్జీవి శివ సినిమా నుంచి ఓ సన్నివేశానికి సంబంధించిన ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశారు.

Advertisement

అయితే అందులో నాగార్జున వెనక కనిపిస్తోన్న వ్యక్తి గురించి ఆర్జీవి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు ఇంతకీ ఈ ఫొటోలో నాగార్జున వెనుక ఉన్న అతను ఎవరో గుర్తుపట్టారా ? ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అతను ఒక సెన్సేషనల్ డైరెక్టర్. ఆయనకంటూ మాస్ ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఏ కమిషనర్ కూతుళ్లకు మొగుళ్ళు రారా.. చంటిగాడు లోకల్ వంటి విభిన్నమైన డైలాగ్స్ ని చిత్రాల కోసం రాసుకొని ఆయనకంటూ ఒక సెపరేట్ ట్రెండ్ సెట్ చేసుకున్నాడు. ఇప్పటికైనా ఆయన ఎవరో గుర్తుపట్టారా..?

Advertisement

ఆయన ఇంకెవరో కాదు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. పూరీ కెరీర్ ఆరంభంలో బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్‏గా ఓ చిన్న పాత్రను పోషించాడు. వర్మ తెరకెక్కించిన శివ చిత్రంలో విలన్ రఘువరన్ బ్యాచ్ లో బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్స్ లో ఒకరుగా నటించాడు పూరి జగన్నాథ్. మాస్ మాహారాజా రవితేజ నటించిన ఇడియట్ చిత్రంతో పూరి జగన్నాథ్ కి యూత్లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. అంతేకాకుండా మహేష్ బాబు, ప్రభాస్, రామ్, చరణ్ తోపాటు ఎంతో మంది హీరోలతో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు పూరీ.

కెరియర్ బిగినింగ్ లో వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన పూరి ఇప్పుడు సెన్సెషన్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో స్థానాన్ని దక్కించుకున్నారు. ఎంతన్నా వర్మ శిష్యుడు కాబట్టి.. నా సినిమాకి నేనే రూలర్ అంటూ ఎవరి మాట వినడు. ఇక గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ సినిమాల పరంగా సరైన సక్సెస్ ని అందుకోలేక పోతున్నారు. విజయ్ దేవరకొండని హీరోగా పెట్టి పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసిన లైగర్ చిత్రంతో పూరి బాగా దెబ్బ అయిపోయాడు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

బేబీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య..! ఎందుకంటే..?

బిగ్ బాస్ 7 లో బ్యాంకాక్ పిల్ల ఎంట్రీ ఇవ్వబోతుందా..!

Takkaridonga : టక్కరి దొంగ సినిమా హీరోయిన్ గుర్తుందా? ఈమె ఇప్పుడు ఎలా ఉందంటే?

Visitors Are Also Reading