Home » Big Boss 7: ఎలిమినేట్ అయిన భోలె.. ఎంత సంపాదించాడో తెలుసా?

Big Boss 7: ఎలిమినేట్ అయిన భోలె.. ఎంత సంపాదించాడో తెలుసా?

by Bunty
Ad

 

Big Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమై ఇప్పటికీ 10 వారాలు పూర్తయింది. ఇక ఇందులో ఒక్కొక్కరు ఒక్కోవారం ఎలిమినేట్ అవుతూనే ఉంటారు. ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అస్సలు ఊహించలేము. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం ఎవరైతే చివరి స్థానంలో ఉంటారో వారు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే పదవవారం బోలే షావలి ఎలిమినేట్ అయ్యాడు. అయితే.. బిగ్‌ హౌజ్‌ లో 5 వారాలు ఉన్న భోలే..రూ.6.25 లక్షలు వసూలు చేశాడట. అంటే వారానికి రూ. 1.25 లక్షలు అన్న మాట.

Shocker in Bigg Boss 7 Telugu as Bhole Shavali Faces Surprise Elimination

ఇది ఇలా ఉండగా.. ఇతను ఓ సింగర్. ఇతని పాటలతో ఆడియన్స్ ను ఎంతగానో అలరించాడు. ఇక్కడికి వచ్చే ముందు బోలె గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ఇప్పుడు తన పాటలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ప్రతివారం మాదిరిగానే గతవారం కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. అందులో కేవలం ఐదు మంది మాత్రమే నామినేషన్ లో ఉన్నారు. ఇక ఆడియన్స్ ఓట్స్ ప్రకారం బోలె షావలికి చాలా తక్కువ ఓట్స్ వచ్చాయి. ఈ వారం రతిక ఎలిమినేట్ అవుతుందని అంత అనుకున్నారు. తాను పెద్దగా గేమ్ ఆడకపోవడంతో ఎలిమినేట్ అవుతుందని భావించారు.

Advertisement

Advertisement

కానీ అందరూ షాక్ అయ్యేలా బోలే ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఎలిమినేట్ అయ్యాక బోలె మాట్లాడుతూ…. పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వాలని, అతను ఒక రైతుబిడ్డ కనుక గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా అని బోలె చెప్పడం జరిగింది. ఇక బోలె స్టేజ్ నుంచి బయటకు వచ్చాక ఈ వారం నామినేషన్ ప్రక్రియ చాలా అన్యాయంగా కొనసాగిందని, నన్ను పిచ్చోడిని చేసి నామినేట్ చేశారని బోలే చెప్పడం జరిగింది. బిగ్బాస్ లో న్యాయం అస్సలు గెలవడం లేదు. కొందరి నోరువల్ల తగ్గాల్సి వస్తుంది. ఈ పాట బిడ్డని పిచ్చోడిని చేశారు కదా అంటూ బోలె షాకింగ్ విషయాలను వెల్లడించారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading