Home » Shoban Babu: 5 వేలు పెడితే 50 కోట్లు… ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నార్ కూడా ఈ విషయంలో శోభన్ బాబు ముందు సరిపోరు..!

Shoban Babu: 5 వేలు పెడితే 50 కోట్లు… ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నార్ కూడా ఈ విషయంలో శోభన్ బాబు ముందు సరిపోరు..!

by Sravya
Ad

Shoban Babu : టాలీవుడ్ లో అందగాడు లెజెండ్రీ హీరో శోభన్ బాబు గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. అప్పట్లో శోభన్ బాబు రొమాంటిక్ గా అనిపించే కుటుంబ కథ చిత్రాలు చేస్తూ కొన్ని పౌరాణిక సినిమాలు చేస్తూ ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు. టాలీవుడ్ లో అందగాడు అంటే లెజెండ్రీ హీరో శోభన్ బాబు మనకి గుర్తొస్తారు. శోభన్ బాబు రొమాంటిక్ గా అనిపించే కుటుంబ కథా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గర అయిపోయారు. ఇదిలా ఉంటే శోభన్ బాబు వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి. శోభన్ బాబు ఏ రోజు కూడా వృత్తిని కానీ ఫ్యామిలీని కానీ నిర్లక్ష్యం చేయలేదు. చెప్పిన టైంకి షూటింగ్ కి వెళ్లేవారట. సినిమాకి ఇవ్వాల్సిన టైం సినిమాకి ఇచ్చేవారు. అలానే ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఫ్యామిలీకి ఇచ్చేవారట.

Advertisement

శోభన్ బాబు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి వారితో పోల్చుకుంటే తక్కువ సంపాదించి ఉంటారని ప్రేక్షకుల అభిప్రాయం ఉంది. కానీ అది నిజం కాదు. శోభన్ బాబు ఆస్తులతో పోల్చుకుంటే వీళ్ళు ఎవరు కూడా అస్సలు సరిపోరని మురళీమోహన్ చెప్పారు. అప్పట్లో శోభన్ బాబు ఇండియాలోనే రిచెస్ట్ హీరో అని మురళీమోహన్ చెప్పారు. శోభన్ బాబు ఆయన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ కూడా భూములు మీద ఇన్వెస్ట్ చేశారని మురళీమోహన్ అన్నారు ఇండియాలోనే రిచెస్ట్ అంటే శోభన్ బాబు అని మురళీమోహన్ అన్నారు. శోభన్ బాబు గారితో పోల్చుకుంటే నేను 10 శాతం కూడా సరిపోను.

Advertisement

Also read:

Also read:

ఆయన అప్పట్లో చెన్నై చుట్టుపక్కల భూములు అన్నిటిని కొన్నారు. ఒక దశలో ఎకరం 5000 పెట్టి కొన్నారు ఆ ల్యాండ్ కొన్నాళ్ల తర్వాత 50 కోట్ల వరకు పలికింది అని మురళీమోహన్ చెప్పారు. కొన్నిసార్లు శోభన్ బాబు అప్పు తీసుకుని కూడా ల్యాండ్ కొన్నారట. భూములు ధరలు భవిష్యత్తులో భారీగా పెరుగుతాయి అని శోభన్ బాబు అందరికంటే ముందే ఊహించారు ఆ భూములన్నీ కూడా వేల కోట్లు ఆస్తులు చేస్తాయి. సుమన్ కూడా శోభన్ బాబు పై ఒకానొక సందర్భంలో ఇటువంటి కామెంట్స్ చేసారు. అప్పట్లో చెన్నై చుట్టుపక్కల ఎక్కడ చూసినా శోభన్ బాబులు భూములే ఉండేవట మరి ఆయన పిల్లలు ఇప్పుడు ఆస్తుల్ని ఉంచుకున్నారు పోగొట్టుకున్నారో తెలీదు అని కూడా సుమన్ చెప్పారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading