Telugu News » Blog » వాళ్ళ పై వచ్చిన రూమర్లతో నా పై వచ్చిన రూమర్ చాలా చిన్నది… శివాని రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు..!

వాళ్ళ పై వచ్చిన రూమర్లతో నా పై వచ్చిన రూమర్ చాలా చిన్నది… శివాని రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు..!

by AJAY
Ads

జీవిత రాజశేఖర్ నటవారసులుగా ఇద్దరు కూతుళ్లు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. శివాత్మిక తో పాటు శివాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటించిన ఆహనాపెళ్ళంట వెబ్ సిరీస్ ఓటీటీ లో విడుదల అయింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా శివాని రాజశేఖర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Advertisement

శివాని ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…. అప్పుడే అంతా నా పెళ్లి గురించి అడుగుతున్నారు. కానీ నేను కెరీర్ పై మాత్రమే దృష్టి పెట్టాను అంటూ వ్యాఖ్యానించింది. అంతేకాకుండా పెళ్లి గురించి ప్రయత్నాలు ఇంకా మొదలు పెట్టలేదని చెప్పింది. ఎవరి పనులతో వాళ్లు బిజీగా ఉన్నామని స్పష్టం చేసింది. అందుకే పెళ్లి గురించి ఆలోచించేంత సమయం కూడా లేదని స్పష్టం చేసింది. అయినా ఇప్పట్లో నా పెళ్ళికి వచ్చిన కంగారు లేదు.. కెరీర్ పరంగా మరింత ముందుకు వెళ్లాలి అనే ఆలోచనలో ఉన్నాను అని వెల్లడించింది.

Advertisement

 

అంతేకాకుండా నేను ఎవరినో ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్టుగా కూడా రూమర్లు వచ్చాయి. మా ఫ్యామిలీకి సంబంధించి ఎప్పుడు వస్తూనే ఉంటాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలలో కొందరు చనిపోయినట్టుగా కూడా వీడియోస్ వచ్చాయని శివాని రాజశేఖర్ వ్యాఖ్యానించింది. వాటితో పోల్చుకుంటే నాపై వచ్చిన రూమర్ చిన్నది అంటూ తెలిపింది. ఆ రూమర్ వచ్చిన తర్వాత నేను మరింత స్ట్రాంగ్ అయ్యాను అంటూ శివాని వెల్లడించింది.