Home » మహేష్ సోదరినే కాదు..ఆ యంగ్ హీరోను కూడా మూడు కోట్లు ముంచిన శిల్పా చౌదరి..!

మహేష్ సోదరినే కాదు..ఆ యంగ్ హీరోను కూడా మూడు కోట్లు ముంచిన శిల్పా చౌదరి..!

by AJAY

శిల్ప చౌదరి కేసులో రోజురోజుకు సంచలనాలు బయటికి వస్తున్నాయి. తరచూ నగర శివారులో ఫేజ్ -3 పార్టీలు ఏర్పాటు చేసి ప్రముఖులను ఆహ్వానిస్తూ శిల్ప చౌదరి కుచ్చుటోపి పెట్టింది. శిల్పా చౌదరి వ్యవహారంలో మోసపోని వారు లేరు. టాలీవుడ్ లోని పలువురు నిర్మాతలు, హీరోలు, ఫైనాన్షియర్ లు అంతేకాకుండా ఐఏఎస్ లను లాయర్ లను సైతం శిల్పా మోసం చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి.

Shilpa Chowdary

ఇప్పటివరకు ఏకంగా 200 కోట్ల వరకు శిల్ప చౌదరి మోసం చేసినట్టు తెలుస్తోంది. తనను తాను వ్యాపారవేత్తగా…. సినీ నిర్మాతగా పరిచయం చేసుకొని అధిక వడ్డీ ఇస్తానంటూ తక్కువ రోజుల్లో డబ్బులు మూడు రెట్లు అవుతాయి అంటూ నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఇటీవలే మహేష్ బాబు సోదరి కూడా శిల్పా చేతిలో మోసపోయింది అంటూ వార్తలు వచ్చాయి. ఇక ఈ కిలాడి లేడీ చేతిలో టాలీవుడ్ కు చెందిన ముగ్గురు హీరోలు సైతం మోసపోయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందులో ఒక హీరో పేరు బయటకు వచ్చింది. హర్ష్ కనుమిల్లి అనే యంగ్ హీరోను శిల్పా చౌదరి మూడు కోట్ల రూపాయలు మోసం చేసినట్లు తెలుస్తోంది.

Harsh kanumilli

Harsh kanumilli

అధిక వడ్డీ ఇప్పిస్తానని హర్ష్ వద్ద మూడు కోట్లు వసూలు చేసి వడ్డీ కాదు కదా అసలు కూడా ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇక శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన సెలబ్రెటీలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. శిల్పా చౌదరిని నర్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు ఆమె భర్త ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఇద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు. దాంతో మోసపోయిన సెలబ్రిటీ అంతా ఒక్కొక్కరుగా నార్సింగి పోలీస్ స్టేషన్ లు వెళ్లి పోలీసులకు వివరాలు చెబుతున్నారు.

AlsoRead: ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్… ఎన్టీఆర్ మహేష్ బాబు ఎపిసోడ్ వచ్చేది అప్పుడే…!

Visitors Are Also Reading