యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు సాధారణ ప్రజలే కాకుండా ప్రముఖ సెలబ్రిటీలు సైతం వచ్చి వినోదాన్ని పంచుతున్నారు. ఇక ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించడంతో టాలీవుడ్ లోని టాప్ హీరోలు హీరోయిన్లు ఈ షోకు అతిధులుగా విచ్చేస్తున్నారు. ఇప్పటివరకు పలువురు దర్శకులు, హీరోలు, హీరోయిన్లు వచ్చి ఆకట్టుకోగా ఇప్పుడు మహేష్ బాబు సైతం గెస్ట్ గా వస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఎన్టీఆర్ మహేష్ బాబు మధ్య సంభాషణ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మహేష్ బాబును హాట్ సీట్ లో కూర్చోబెట్టి ఎన్టీఆర్ ఎలాంటి వినోదాన్ని పంచుతారా అనేది ఆసక్తికరంగా మారింది.
Advertisement
Mahesh babu with ntr
దాంతో అటు ఎన్టీఆర్ అభిమానులు ఇటు మహేష్ అభిమానులు ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 5 వ తేదీన ఆదివారం రాత్రి 8:30 నిమిషాలకు టెలికాస్ట్ చేయనున్నారు.
Advertisement
Evaru melo kotishwarudu
షో టైమింగ్స్ తెలియడంతో ఎన్టీఆర్, మహేష్ బాబు అభిమానులు ఆదివారం కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అంతే కుండా ఇప్పటికే మహేష్ బాబు ఎన్టీఆర్ ల పేర్లు ట్విట్టర్ ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఇక ఈ షో నుండి మరో ఆసక్తికరమైన విషయం కూడా ఫిల్మీ దునియా లో చక్కర్లు కొడుతోంది.
మహేష్ బాబుకు ఎన్టీఆర్ పలు ప్రశ్నలు సంధించగా ఒక ప్రశ్న దగ్గర మహేష్ బాబు కన్ఫ్యూజ్ అవుతారట. ఆ సమయంలో ఫోన్ ఆర్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకుని మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేస్తారని తెలుస్తోంది. దాంతో ఈ షో పై మరింత ఆసక్తి పెరిగింది. మరి ఎన్టీఆర్ మహేష్ బాబు ఏ మేరకు సందడి చేస్తారో చూడాలంటే ఆదివారం వరకు అభిమానులు వెయిట్ చేయాల్సిందే.
Advertisement
Akhanda collection’s : బాలయ్య అరాచకం…బాక్స్ ఆఫీస్ వద్ద అఖండ ఊచకోత…!